
దుర్బల సాక్షుల (vulnerable witnesses) నిర్వచనాన్ని సుప్రీం కోర్టు మరింతగా విస్తరించింది. ఢిల్లీ హైకోర్టు మార్గదర్శకాలలోని సెక్షన్ 3 కింద దుర్బల సాక్షుల పరిధిలో లైంగిక వేధింపుల బాధితులు, మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారిని కూడా చేర్చాలని ఓ తీర్పులో దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా దుర్బల (బలహీన, రక్షణ లేని) సాక్షులను రక్షించానే అంశంపై దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా.. ఎవరిని బలహీన సాక్షిగా చూడవచ్చో, అటువంటి వారి నుంచి సాక్ష్యాలను నమోదు చేయడానికి ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎలా ఉందో వివరిస్తూ ధర్మాసనం మార్గదర్శకాలను రూపొందించింది. ఈ క్రమంలోనే అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది విభా మఖిజా.. అన్ని హైకోర్టులలో Vulnerable Witness Deposition Centres ఏర్పాటు చేయాలని, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన నిరంతర శిక్షణ అవసరమని సూచించారు.
అమికస్ క్యూరీ పరిగణలోని తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. రెండు నెలల్లోగా ఈ వీడబ్ల్యూడీసీ స్కీమ్‌ను స్వీకరించి.. నోటిఫై చేయాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది. ఈ నిర్వచనం కేవలం పిల్లల సాక్షులకే పరిమితం కాదని ధర్మాసనం పేర్కొంది.
ఈ నిర్వచనం కేవలం child witnessesకే (18 ఏళ్లు లేని పిల్లలు) పరిమితం కాదని ధర్మాసనం పేర్కొంది. ఇందులో లైంగిక వేధింపులకు గురై వయస్సు, లింగ బేధం లేని అత్యాచార బాధితులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న సాక్షులు, కేంద్ర ప్రభుత్వం సాక్షుల రక్షణ పథకం ప్రకారం ముప్పు ఉన్న సాక్షులు, మాట్లాడటం లేదా వినికిడి లోపం ఉన్న వ్యక్తులు, సంబంధిత న్యాయస్థానం పరిగణించే సాక్షులను చేర్చింది.