ఢిల్లీలో లాక్‌డౌన్ ఉండ‌దు.. ఆందోళ‌న చెంద‌కండి - సీఎం అరవింద్ కేజ్రీవాల్

Published : Jan 11, 2022, 04:24 PM IST
ఢిల్లీలో లాక్‌డౌన్ ఉండ‌దు.. ఆందోళ‌న చెంద‌కండి - సీఎం అరవింద్ కేజ్రీవాల్

సారాంశం

ఢిల్లీలో లాక్ డౌన్ విధించబోమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

ఢిల్లీలో లాక్ డౌన్ (lock down) విధించ‌బోమ‌ని.. ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ (cm arvind kejriwal) అన్నారు. దేశ రాజ‌ధానిలో కోవిడ్ -19 (covid- 19) కేసులు అధికంగా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో లాక్ డౌన్ విధిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం స్పందించారు. రాష్ట్రంలో క‌రోనా చికిత్స కోసం సిద్ధంగా ఉన్న సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించేందుకు న‌గ‌రంలోని ఓ హాస్పిట‌ల్ ను సీఎం కేజ్రీవాల్ మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

ఢిల్లీలో క‌రోనా (corona) కేసులు పెరుగుతున్నాయ‌ని, గ‌త రెండు మూడు రోజులుగా పాజిటివిటీ రేటు (positivity rate) దాదాపు 24-25 శాతంగా ఉంద‌ని  సీఎం కేజ్రీవాల్ చెప్పారు. క‌రోనాను కట్ట‌డి చేయ‌డానికి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ వంటి క‌ఠిన‌మైన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. అయితే ఢిల్లీ ప్ర‌జ‌లెవ‌రూ చింతిచాల్సిన ప‌ని లేద‌ని, రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం రోజు రాష్ట్రంలో దాదాపు 20,000-22,000 కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతాయని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తుంద‌ని తెలిపారు. 

గ‌తేడాది సెకండ్ వేవ్ లో (second wave) డెల్టా వేవ్ లో (delta wave) వ‌చ్చిన కేసులతో పోల్చితే థర్డ్ వేవ్ లో (third wave) క‌రోనా పాజిటివ్ గా తేలిన పేషెంట్ల‌కు చాలా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉంటున్నాయ‌ని సీఎం అన్నారు. ఓమిక్రాన్ (omicron) తేలిక ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ చాలా వేగంగా వ్యాపిస్తుంద‌ని తెలిపారు. ఢిల్లీ డిజాస్గ‌ర్ మేనేజ్ మెంట్ అథారిటీ తో (DDMA) స‌మావేశంలో పాల్గొన్న‌ప్పుడు ఆంక్ష‌లు మొత్తం నేష‌నల్ క్యాపిట‌ల్ రీజియ‌న్ (NCR)  ప‌రిధిలో అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరామ‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు త‌మ‌కు ఆ విష‌యంలో హామీ ఇచ్చార‌ని అన్నారు. 

మ‌రో సారి వీకెంట్ క‌ర్ఫ్యూ..
మ‌రో సారి వీకెండ్ క‌ర్ఫ్యూ విధించే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ హెల్త్ మినిస్ట‌ర్ స‌త్యేంద్ర జైన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్ప‌టికే ఢిల్లీలో వేవ్ వ‌చ్చేసింద‌ని ఆయ‌న తెలిపారు. అయితే వ‌చ్చే రెండు రోజుల్లో లేదా ఈ వారం మొత్తంలో ఢిల్లీలో క‌రోనా కేసులు పీక్ స్టేజ్ కు చేరుతాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ త‌రువాత కేసులు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. అయితే ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు. మాస్క్ ధ‌రించ‌డం, భౌతికదూరం పాటించ‌డం, చేతుల‌ను శానిటైజ్ చేయ‌డం వంటి ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను పాటించ‌డం మానేయ‌కూడ‌ద‌ని సూచించారు. 

ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ ఆఫీసులు (privet office) మూసి వేయాలని మంగ‌ళ‌వారం డీడీఎంఏ (ddma) ఆదేశించింది. ఉద్యోగులందరితో వ‌ర్క్ ఫ్రం హోం (work form home)  విధానంలో ప‌ని చేయించుకోవాల‌ని సూచించింది. అయితే అత్య‌వ‌సర సేవ‌లు అందించే వాటికి మిన‌హాయింపు ఇచ్చింది. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం రెస్టారెంట్లు (restarents), బార్‌లు (bar) కూడా మూసేశారు. అయితే హోం డెలివ‌రీ (home delivery) , పార్శిల్ సౌక‌ర్యం మాత్రం క‌ల్పించారు. వ‌ర్క్ ఫ్రం హోం నుంచి ప్రైవేట్ బ్యాంకులు (privet banks), ఎమెర్జ‌న్సీ స‌ర్వీసు (emargency service) అందించే ఆఫీసులు, ఇన్సూరెన్స్ కంపెనీలు (insurence company), ఫార్మా కంపెనీలు (farma comany), మైక్రోఫైనాన్స్ కంపెనీలు (micro finance companys), లాయర్ల ఆఫీసులు (lawyers offices), కొరియ‌ర్ స‌ర్వీసులకు (coriar service) ఇత‌ర అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించే వాటికి మాత్ర‌మే మిన‌హాయింపు ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?