Asianet News TeluguAsianet News Telugu

Delhi Air Pollution: పూర్తి లాక్‌డౌన్‌కు సిద్దం.. సుప్రీం కోర్టుకు తెలిపిన ఢిల్లీ ప్రభుత్వం

ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Air Pollution) కట్టడికి పూర్తి లాక్‌డౌన్ (complete lockdown) విధించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా Delhi govt సోమవారం సుప్రీం కోర్టుకు (Supreme court) తెలిపింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో (National Capital Region) పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోరుగు ప్రాంతాలకు ఇలాంటి ఆంక్షలు అవసరమని పేర్కొంది. 
 

Delhi Pollution Ready to impose complete lockdown to control air pollution Delhi govt tells Supreme court
Author
New Delhi, First Published Nov 15, 2021, 1:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Air Pollution) కట్టడికి సంబంధించి ఢిల్లీ సర్కార్ కీలక వ్యాఖ్యలు చేసింది. వాయు కాలుష్యంపై పోరాడటానికి పూర్తి లాక్‌డౌన్ (complete lockdown) విధించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా Delhi govt సోమవారం సుప్రీం కోర్టుకు (Supreme court) తెలిపింది. ఈ మేరకు గాలి నాణ్యతను మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.అయితే లాక్‌డౌన్ పరిమిత ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుందని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో (National Capital Region) పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోరుగు ప్రాంతాలకు ఇలాంటి ఆంక్షలు అవసరమని పేర్కొంది. 

ఢిల్లీలో వాయు కాలుష్యంపై సోమవారం Supreme court విచారణ జరిపింది. చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ డివై చంద్ర చూడ్, జస్టిస్ సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసం వాదనలు వింది. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం సంవత్సరానికి సగటున విడుదలయ్యే ఉద్గారాలలో కేవలం 10 శాతం మాత్రమేనని కోర్టకు తెలిపారు.

విచారణకు ముందు సుప్రీం ధర్మాసనం ముందు దాఖలు చేసిన ఆఫిడవిట్‌లో.. ‘స్థానిక ఉద్గారాలను నియంత్రించడానికి పూర్తి లాక్‌డౌన్ వంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే, పొరుగు రాష్ట్రాల్లోని ఎన్‌సిఆర్ ప్రాంతాలలో దీనిని అమలు చేస్తే అటువంటి చర్య అర్థవంతంగా ఉంటుంది’ అని ఢిల్లీ ప్రభుత్వం affidavitలో పేర్కొంది. వాయు కాలుష్యం కట్టడికి ఇప్పటిరకు తీసుకున్న చర్యలను తెలిపిన Delhi govt .. వారం రోజులు పాటు ఢిల్లీలోని పాఠశాలల్లో భౌతిక తరగతుల నిర్వహణ జరగదని, ప్రభుత్వ అధికారులు ఇంటి నుంచే పని చేస్తారని, ప్రైవేటు కార్యాలయాలు కూడా తమ సిబ్బందిని ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతులు ఇవ్వాలని సూచించినట్టుగా తెలిపింది. అంతేకాకుండా అన్నినిర్మాణ పనులను, కూల్చివేతలను నవంబర్ 17 వరకు నిలిపివేయనున్నట్టుగా తెలిపింది. 

సుప్రీం కోర్టు వ్యాఖ్యలు.. 
విచారణ సందర్బంగా.. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడానికి.. కర్మాగారాలు, రవాణా, దుమ్ము, కొంత భాగం పంటను పంటను తగులబెట్టడం వల్ల వచ్చే కాలుష్యం ప్రధాన కారణమని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. దీంతో రోడ్లపై దుమ్మును తొలగించడానికి ఎన్ని మెకానికల్ రోడ్ స్వీపింగ్ మిషన్లు అవసరమో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ (బీజేపీ పాలిస్తున్న) అఫిడవిట్ దాఖలు చేయవచ్చని ఢిల్లీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రాహుల్ మెహ్రా చెప్పారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్.. మున్సిపల్ కార్పొరేషన్‌పై నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. 

ఇదిలా ఉంటే.. జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) స్పందిస్తూ.. ‘ఈ రకమైన కుంటి సాకులు చెబితే మీరు ఆర్జిస్తున్న ఆదాయాలు, ప్రజాదరణ నినాదాల కోసం వెచ్చిస్తున్న ఆదాయాలపై సరైన ఆడిట్ నిర్వహించవలసి వస్తుంది’ అంటూ హెచ్చరించారు. 

కాలుష్య నియంత్రణకు అత్యవసర చర్యలు తీసుకోకపోవడం విచారకరమని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ఢిల్లీ కాలుష్యంపై రేపు అత్యవసర సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించారు. అత్యవసర సమావేశంలో యూపీ, హర్యానా, పంజాబ్ ముఖ్యకార్యదర్శులు హాజరుకావాలని పేర్కొన్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలు వర్క్ ఫ్రమ్ హోం (ఇంటి నుంచే పనిచేయడం) ఆదేశించాలని కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios