బీమా కోరేగావ్‌ కేసులో వరవరరావుకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీం కోర్టు

Published : Jul 12, 2022, 01:16 PM IST
బీమా కోరేగావ్‌ కేసులో వరవరరావుకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీం కోర్టు

సారాంశం

భీమా కోరేగావ్ హింసాకాండ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ రచయిత వరవరరావు దాఖలు చేసిన శాశ్వత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే వరవరరావుకు వైద్య కారణాలతో మంజూరైన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది.

భీమా కోరేగావ్ హింసాకాండ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ రచయిత వరవరరావు దాఖలు చేసిన శాశ్వత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనకు పర్మినెంట్ మెడికల్ బెయిల్ ఇవ్వాలని వరవరరావు చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 13న తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే బాంబే హైకోర్టు ఆదేశాలను వరవరరావు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ క్రమంలోనే వరవరరావు శాశ్వత్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగింది. 

ఈ సమయంలో వరవరరావుకు వైద్య కారణాలతో మంజూరైన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంగళవారం పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఇది కొనసాగనుంది. అదే సమయంలో శాశ్వత బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం జూలై 19కు వాయిదా వేసింది. 

భీమా కోరెగావ్ కేసులో 2018 ఆగస్టు 28న వరవరరావును హైదరాబాద్‌లోని ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. ఆ కేసులో విచారిస్తున్నారు. వరవరరావుపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, ఐసీపీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వరవరరావును తొలుత గృహనిర్బంధంలో ఉంచారు. అయితే 2018 నవంబర్‌లో పోలీసు కస్టడీలోకి తీసుకుని తలోజా జైలుకు తరలించారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్