
Samyukta Kisan Morcha meet: కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, లఖింపూర్ ఖేరీ రైతులపైకి కారును పోనిచ్చిన హింసాకాండ కేసులో ప్రభుత్వ నిష్క్రియాత్మకత విషయాలపై చర్చించడానికి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) మరోసారి సమావేశం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని రైతు సంఘాల నాయకులు మంగళవారం జరిగే ఈ సమావేశంలో పాలుపంచుకోనున్నారు. వివిధ రైతు సంఘాల గొడుగు సంస్థ సమావేశంలో దాదాపు 60 వ్యవసాయ సంఘాలు పాల్గొనబోతున్నాయి. "భారతదేశం నలుమూలల నుండి వ్యవసాయ సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయి" అని రైతు నాయకుడు, సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సభ్యుడు అభిమన్యు కోహర్ అన్నారు.
గత వారం, SKM తమ ఆందోళన తదుపరి దశను ప్రకటించింది. అయితే ఇప్పుడు రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 9 న ఎత్తివేయబడినప్పుడు రైతులకు చేసిన “వ్రాతపూర్వక వాగ్దానాలను కేంద్రం పూర్తిగా తిరస్కరించడం” పట్ల నిరాశను వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మరోసారి తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం నాటి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రశ్నించగా.. రైతుల ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చిస్తామని రైతు నాయకులు చెప్పారు.
“మేము కనీస మద్దతు ధర కోసం చట్టబద్ధమైన హామీని, అలాగే SKMని అపోలిటికల్‌గా ఉంచడానికి నియమాలు, సంబంధిత నిబంధనలను చర్చిస్తాము. వ్యవసాయంపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) 2021 నిర్ణయంపై కూడా చర్చించనున్నారు. ఇది తప్పుడు తీర్పు, భారతదేశంలోని రైతులను నేరుగా ప్రభావితం చేస్తుంది”అని కోహర్ అన్నారు. డిసెంబర్ 14, 2021 ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి అందిన ఒక నివేదికను ఆమోదించిన 120 రోజులలోపు ఉత్పత్తి సహాయం, బఫర్ స్టాక్, మార్కెటింగ్, రవాణా పథకాల కింద నిషేధించబడిన సబ్సిడీలను ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని సిఫార్సు చేసింది. "మేము లఖింపూర్ ఖేరీ హింస కేసు గురించి కూడా చర్చిస్తాము. అసలు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. కానీ రైతులను అరెస్టు చేశారు. ప్రభుత్వ తీరు దారుణంగా ఉంది. మేము అన్ని చర్యలపైనా చర్చిస్తాం" అని రైతు సంఘ నాయకులు వెల్లడించారు.
గతేడాది అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. అత్యంక క్రూరంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారును పోనిచ్చారు. దీనికి సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి కుమారునిపై కేసు నమోదైంది. ప్రభుత్వ “ద్రోహాన్ని నిరసిస్తూ, స్వాతంత్య్ర సమరయోధుడు ఉధమ్‌సింగ్‌ను బ్రిటిష్ వారు ఉరితీసిన జూలై 31 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే జూలై 18 నుండి SKM దేశవ్యాప్తంగా 'విశ్వస్‌ఘాట్ సెమినార్‌లను' నిర్వహిస్తుందని రైతు సంఘ నాయకులు వెల్లడించారు.
SKM ప్రకారం.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 18 నుండి ఆగస్టు 20 వరకు లఖింపూర్ ఖేరీలో 75 గంటల సామూహిక ధర్నా నిర్వహించనున్నట్లు SKM తెలిపింది. లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ నిందితుడు. అతనిపై చర్యలు తీసుకోవడంతో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.