అగ్రి చట్టాలు: 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వండి.. కమిటీకి సుప్రీం ఆదేశం

By Siva KodatiFirst Published Jan 12, 2021, 7:31 PM IST
Highlights

కొత్త వ్యవసాయ చట్టాలపై రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది సుప్రీంకోర్టు. పది రోజుల్లోగా తొలి సమావేశం కావాలని సూచించింది. రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని ప్రశంసించింది సుప్రీంకోర్ట్

కొత్త వ్యవసాయ చట్టాలపై రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది సుప్రీంకోర్టు. పది రోజుల్లోగా తొలి సమావేశం కావాలని సూచించింది. రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని ప్రశంసించింది సుప్రీంకోర్ట్.

అయితే రైతులు మాత్రం సుప్రీంకోర్టు కమిటీతో చర్చలు జరపమని చెబుతున్నారు. మూడు చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు రైతులు. కేంద్రం తమతో నేరుగా చర్చించాలని.. రైతు సంఘాల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.

చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పే అధికారం కమిటీకి లేదన్నారు. మరోవైపు ఇవాళ వ్యవసాయ చట్టాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పూర్తి తీర్పు వచ్చే వరకు చట్టాలపై స్టే కొనసాగుతుందని తెలిపింది.

Also Read:అగ్రి చట్టాలపై కమిటీ.. సభ్యులంతా కేంద్రం మద్ధతుదారులే: రైతుల వ్యాఖ్యలు

అలాగే రైతుల ఆందోళనపై కేంద్రం అభ్యంతరం అభ్యంతరాలను తోసిపుచ్చింది. రైతుల ఆందోళనను చావు బతుకుల సమస్య అన్న చీఫ్ జస్టిస్.. తమ అధికారాలను ఉపయోగించి స్టే విధిస్తున్నట్లు తెలిపారు.

అదే విధంగా రైతుల ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని సుప్రీం నియమించింది. రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

భూపేందర్‌ సింగ్‌‌ మాన్‌(బీకేయూ), ప్రమోద్‌ కుమార్‌ జోషి(ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌), అశోక్‌ గులాటీ(వ్యవసాయ శాస్త్రవేత్త), అనిల్‌ ఘావంత్‌(షెట్కారీ సంఘటన) ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించింది

click me!