స్వలింగ సంపర్క జంటలకు దత్తత హక్కులు లేవు: 3:2 తీర్పులో సుప్రీం కోర్టు

By Sumanth Kanukula  |  First Published Oct 17, 2023, 1:43 PM IST

స్వలింగ వివాహాలకు చట్టపరమైన హోదా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.


స్వలింగ వివాహాలకు చట్టపరమైన హోదా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు సందర్భంగా.. అవివాహిత, స్వలింగ సంపర్క జంటలను దత్తత తీసుకోవడానికి అనుమతించడంపై ఆశను రేకెత్తించింది. అయితే ఇందుకు సుప్రీం ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులలో కేవలం ఇద్దరు మాత్రమే అంగీకరించగా, మరో ముగ్గురు విభేదించారు. దీంతో ఆ అంశం కొట్టివేయబడింది. 

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ఎస్ కౌల్.. స్వలింగ సంపర్క, అవివాహిత జంటలు దత్తత తీసుకునే హక్కును కలిగి ఉంటారని పేర్కొనగా.. దానితో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలు విబేధించారు. దత్తత నుంచి స్వలింగ సంపర్క, అవివాహిత జంటలను మినహాయించే CARA నిబంధనలను సమర్థించారు. 

Latest Videos

ఇక, తన తీర్పు సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. భిన్న లింగ వివాహిత జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని భావించలేమని అన్నారు. ‘‘పెళ్లికాని జంటలను దత్తత తీసుకోకుండా చట్టం నిరోధించలేదని, పిల్లల ప్రయోజనాల కోసం అవివాహిత జంటలను దత్తత తీసుకోకుండా నియంత్రించడాన్ని యూనియన్ ఆఫ్ ఇండియా నిరూపించలేదని సీజేఐ అన్నారు. అవివాహిత జంటలను నిరోధించడంలో CARA తన అధికారాన్ని మించిపోయింది’’ అని సీజేఐ పేర్కొన్నారు. CARA సర్క్యులర్ (క్వీర్ జంటలను దత్తత తీసుకోకుండా మినహాయిస్తుంది) రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘిస్తోందని అన్నారు. 

ఇదిలాఉంటే, దేశంలో స్వలింగ సంపర్కుల కమ్యూనిటీకి వివాహ సమానత్వ హక్కులను ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. స్వలింగ సంపర్కుల వివాహాల నిర్ణయం చట్టసభలదేనని తెలిపింది. ఆ జంటలకు ఇవ్వగల హక్కులు,  ప్రయోజనాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం చేసిన ప్రకటనను సుప్రీంకోర్టు నమోదు చేసింది. అలాగే లైంగిక ధోరణి ఆధారంగా ఒక వ్యక్తి యూనియన్‌లోకి ప్రవేశించే హక్కును పరిమితం చేయలేమని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం ఉన్న చట్టాలు లేదా వ్యక్తిగత చట్టాల ప్రకారం భిన్న లింగ సంబంధాలలో ఉన్న లింగమార్పిడి వ్యక్తులకు వివాహం చేసుకునే హక్కు ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. 

click me!