అయోధ్య వివాదం: సుప్రీం నియమించిన మధ్యవర్తులు వీరే

By narsimha lodeFirst Published Mar 8, 2019, 10:53 AM IST
Highlights

అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం నాడు అయోధ్య మధ్యవర్తిత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది.ముగ్గురు మధ్య వర్తులను సుప్రీంకోర్టు నియమించింది.

అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం నాడు అయోధ్య మధ్యవర్తిత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది.ముగ్గురు మధ్య వర్తులను సుప్రీంకోర్టు నియమించింది.

ముగ్గురు మధ్యవర్తులతో కూడి ప్యానెల్ ఏర్పాటుకు సుప్రీం పచ్చజెండా ఊపింది. ఈ ప్యానెల్ నాలుగు వారాల్లో తన నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మధ్యవర్థులుగా పండిట్ రవిశంకర్, జస్టిస్ ఖలీవుల్లా, లాయర్ శ్రీరాం పంచ్‌లు సభ్యులుగా ఉంటారు. మధ్యవర్తిత్వ ప్రక్రియను గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫైజాబాద్‌లో మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

రెండు రోజుల క్రితం ఈ విషయమై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా మధ్యవర్తిత్వ ప్రక్రియను హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లిం సంఘాలు మాత్రం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాయి. బుధవారం నాడు ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత  తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం  రిజర్వ్‌లో పెట్టింది. ఇవాళ సుప్రీంకోర్టు అయోధ్య మధ్యవర్తిత్వంపై తీర్పును వెలువరించింది.

2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వ్యక్తులు, ధార్మికసంస్థల తరఫున 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

 

సంబంధిత వార్తలు

అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్: మధ్యవర్తిత్వానికి హిందూ సంఘాల వ్యతిరేకత

 

click me!