ఆలింగనంతో చెట్లను కాపాడిన.. చిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్ బహుగుణ కోవిడ్‌తో కన్నుమూత

Siva Kodati |  
Published : May 21, 2021, 02:35 PM IST
ఆలింగనంతో చెట్లను కాపాడిన.. చిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్ బహుగుణ కోవిడ్‌తో కన్నుమూత

సారాంశం

కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం సృష్టిస్తోంది. ఈ క్రమంలో సినీ, క్రీడా, రాజకీయాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులను సైతం బలి తీసుకుంటోంది. తాజాగా ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత, గాంధేయవాది సుందర్‌లాల్ బహుగుణ కోవిడ్‌తో కన్నుమూశారు

కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం సృష్టిస్తోంది. ఈ క్రమంలో సినీ, క్రీడా, రాజకీయాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులను సైతం బలి తీసుకుంటోంది. తాజాగా ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత, గాంధేయవాది సుందర్‌లాల్ బహుగుణ కోవిడ్‌తో కన్నుమూశారు.

శుక్రవారం రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. అడవుల విధ్వంసానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా హిమాలయాల్లో అడవుల సంరక్షణం కోసం, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బహుగుణ జీవితాంతం కృషి చేశారు.

ఆయన చేసిన కృషి, పట్టుదల కారణంగానే అడవులను నరక్కుండా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నిషేధం విధించారు. ఆయన ఇచ్చిన 'ఎకాలజీ ఈజ్ ది పెర్మనెంట్ ఎకానమీ' అనే నినాదం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Also Read:దేశంలో కరోనా కేసులు : 20.61లక్షల పరీక్షలు.. 2.59 లక్షల పాజిటివ్ కేసులు...

చెట్లు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందిరకీ అర్ధమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని బహుగుణ నిర్వహించారు. 1973లో చేపట్టిన అహింసాయుత చిప్కో ఉద్యమంలో అడవుల పరిరక్షణ లక్ష్యంగా ఆయన పోరాటం సాగించారు.

చిప్కో అంటే ఆలింగనం అని అర్ధం. చెట్లను కొట్టివేస్తున్నప్పుడు ప్రజలు చెట్లకు ఆలింగనం చేసుకోవడం ప్రారంభమైది. మొదట చెట్లను పరిరక్షించుకునే ఉద్యమంగా, క్రమంగా ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా అది రూపుదిద్దుకుంది.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?