
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఊరట లభించింది. సునంద్ పుష్కర్ మృతి కేసులో శశిథరూర్‌పై అభియోగాలను ఢిల్లీ స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది.
సునంద్ పుష్కర్ 2014 జనవరి 17వ తేదీన ఢిల్లీలోని ఓ హోటల్‌లో అనుమానాస్పదస్థితిలో మరణించింది. సునంద్ పుష్కర్ ఆత్మహత్యకు శశిథరూర్ కారణమని ఢిల్లీ పోలీసులు ఆయనపై అభియోగాలు నమోదు చేశారు.శశిథరూర్‌పై అభియోగాలను మోపడానికి కోర్టు నిరాకరించింది. అతనిపై మోపిన అన్ని అభియోగాలను కూడా తొలగించింది కోర్టు.
ఈ తీర్పు తర్వాత శశిథరూర్ స్పందించారు. ఇది ఏడున్నర ఏళ్ల సంపూర్ణ హింసను అనుభవించినట్టుగా చెప్పారు. ఈ కేసుపై 2015 జనవరి 1వ తేదీన సునంద్ పుష్కర్ పై గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని కేసు నమోదు చేశారు.
2019 ఆగష్టు 31న సునంద్ పుష్కర్ మరణానికి సంబంధించి ధరూర్ పై ఆత్మాహత్యాయత్నం లేదా అతనిపై హత్య ఆరోపణలపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. పోస్టుమార్టం నివేదికలో సునంద్ పుష్కర్ మరణానికి విషం కారణమని తేలింది. సునంద్ పుష్కర్ మరణానికి ముందు ఆమెశరీరంపై గాయాలు కూడ ఉన్నాయని కూడ ఆ నివేదిక తెలిపింది.
సునంద్ పుష్కర్ మరణానికి ఇంకా ఎలాంటి కారణాన్ని ధృవీకరించలేదని శశిథరూర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పుష్కర్ ది హత్యా ఆత్మహత్యా అనే విషయాన్నిఇంకా నిర్ధారించలేదన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకొందా హత్య జరిగిందా అనేది ఇంకా స్పష్టత కాలేదు.