నేడు హిమాచల్ ప్రదేశ్ సీఎం స్వీకారం.. ఖర్గే, గాంధీలకు థ్యాంక్స్ చెప్పిన సుఖ్వీందర్ సుఖు

By team teluguFirst Published Dec 11, 2022, 11:57 AM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖును హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆయన నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. 

హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనను సీఎంగా ప్రకటిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి తీసుకొచ్చిన సిబ్బంది

“ కాంగ్రెస్ నాయకులు, గాంధీ కుటుంబానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో హిమాచల్ ఎన్నికలు జరిగాయి. ఆమె రెండు నెలల క్రితమే పార్టీకి చెందిన హిమాచల్ నేతలందరితో మాట్లాడారు. సోలన్‌లో ఆమె మొదటి ర్యాలీ తర్వాత మాకు లభించిన మద్దతు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎంతో సహాయపడింది.’’ అని సుఖ్వీందర్ సుఖు తెలిపినట్టు‘ఇండియా టుడే’ కథనం పేర్కొంది.

ఛత్తీస్‌గఢ్‌ లో ఘోర ప్రమాదం... ఫ్లైఓవర్‌ను ఢీకొట్టి కిందపడ్డ బైక్‌.. దంపతులు మృతి, కుమార్తెకు గాయాలు

ప్రతిభా సింగ్ కు సీఎం పదవి వరించకపోవడంపై ఆయన స్పందిస్తూ.. తాను ఎవరినీ మర్చిపోలేదని, ప్రతీ ఒక్కరూ హక్కులను పొందుతారని చెప్పారు. ఆమె, ఆమె కుమారుడు విక్రమాదిత్యకు మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని అన్నారు. 

తమిళనాడులో మాండౌస్ తుఫాను బీభత్సం.. నలుగురు మృతి ; టాప్ పాయింట్స్

కాగా.. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ యూనిట్ మాజీ అధ్యక్షుడిగా ఉన్న సుఖ్‌విందర్ సింగ్ సుఖు నేడు ఆ రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం 58 ఏళ్ల వయస్సున్న సుఖు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే శనివారం జరిగిన పార్టీ కీలక సమావేశం అనంతరం ఆయన హిమాచల్ కొత్త సీఎంగా ఎన్నికయ్యారు. అలాగే ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.
 

click me!