ఛత్తీస్‌గఢ్‌ లో ఘోర ప్రమాదం... ఫ్లైఓవర్‌ను ఢీకొట్టి కిందపడ్డ బైక్‌.. దంపతులు మృతి, కుమార్తెకు గాయాలు

By team teluguFirst Published Dec 11, 2022, 9:08 AM IST
Highlights

ఛత్తీస్ ఘడ్ లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జిను ఢీకొట్టి ఓ బైక్ పై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న భార్యాభర్తలు చనిపోయారు. వారి కూతురు తీవ్రగాయాలతో బయటపడింది. అయితే పోలీసులు అక్కడ అడ్డంకిని ఏర్పాటు చేస్తున్న సమయంలో మరో కారు వచ్చి బ్రిడ్జి డెడ్ ఎండ్ నుంచి పడిపోయింది. 

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలోని దుర్గ్-రాయ్‌పూర్ రోడ్డుపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌పై నుంచి ఓ బైక్ కిందపడిపోయింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. వారి 12 ఏళ్ల కుమార్తె తీవ్రంగా గాయపడింది. కుమ్హారి పట్టణంలో శుక్రవారం రాత్రి జంజ్‌గిరి గ్రామంలో ఓ వివాహానికి హాజరైన ఈ దంపతులు రాయ్‌పూర్‌లోని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రభాత్ కుమార్ తెలిపారు.

తమిళనాడులో మాండౌస్ తుఫాను బీభత్సం.. నలుగురు మృతి ; టాప్ పాయింట్స్

జాతీయ రహదారి-53పై నిర్మాణంలో ఉన్న ఓవర్‌బ్రిడ్జి వాహనదారులను అలెర్ట్ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదా మళ్లింపును సూచించే ఎలాంటి సిగ్నల్ లేదని అధికారులు ఆయన తెలిపారు. ‘‘ఫ్లైఓవర్ ఓ లేన్ ఇంతకు ముందే పూర్తయ్యింది. దానిని రాకపోకల కోసం తెరిచారు. మరో లైన్ నిర్మాణం జరుగుతోంది. అక్కడ అలెర్ట్ సిగ్నల్ లేదా అడ్డంకి లేకపోవడంతో బైక్ వెళ్తున్న దంపుతులు అదుపుతప్పి దానిపై నుంచి పడిపోయారు. ఈ ఓవర్ బ్రిడ్జి దాదాపు 30 అడుగులు ఉంటుంది ’’ అని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఆజురామ్ దేవాంగన్ (46), అతడి భార్య నిర్మల (42) అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమార్తె అన్ను (12) తీవ్రంగా గాయపడింది. దీంతో బాలికను చికిత్స కోసంఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రాయ్‌పూర్‌కు తరలించారు.

ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు హామీ ఇవ్వనంత వరకు జ‌మ్మూకాశ్మీర్ అభివృద్ధి చెందదు: ఫరూక్ అబ్దుల్లా

అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు ఈ రోడ్డపై ఓ అడ్డంకిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు అదే లేన్‌లోకి ప్రవేశించి బ్రిడ్జి డెడ్ నుంచి పడిపోయిందని ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. కాగా.. ఈ కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని, ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోవడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా.. ఇదే రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో నెల రోజుల క్రితం బలోడా రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి వంతెనపై నుంచి 20 అడుగుల లోతులో ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో కారుతో పాటు డ్రైవింగ్ చేస్తున్న వ్యాపారి కూడా నీటిలో మునిగిపోయాడు. అయితే అక్కడే ఉన్న స్థానిక యువకులు వెటనే నీటిలోకి దూకి ఆ వ్యాపారిని బయటకు తీశారు. అనంతరం చుట్టుపక్కల గ్రామస్తుల సహకారంతో ట్రాక్టర్‌తో కారును బయటకు తీసుకొచ్చారు.

మహారాష్ట్ర-క‌ర్నాట‌క స‌రిహ‌ద్దు వివాదం: ఈ నెల 14న ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల భేటీ

9 నెలల క్రితం రాయ్‌పూర్‌లో  పాఠశాల విద్యార్థుల కారు అదుపు తప్పి సెరిఖేడి ఓవర్‌బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో కారు 20 అడుగుల మేర గాలిలోకి ఎగిరి పొలాల్లో పడిపోయింది. నేలను ఢీకొట్టిన వెంటనే కారు వీల్స్, ఇతర భాగాలు ఎక్కడిక్కడ విడిపోయింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి చనిపోగా.. కారులో ఉన్న మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. 

click me!