మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ద విమానాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

Published : Jan 28, 2023, 11:39 AM ISTUpdated : Jan 28, 2023, 12:03 PM IST
మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ద విమానాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

సారాంశం

భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ద విమానాలు మధ్యప్రదేశ్‌లో కుప్పకులాయి. కుప్పకూలిన వాటిలో సుఖోయ్-30, మిరాజ్ 2000 యుద్ద విమానాలు ఉన్నాయి.

భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ద విమానాలు మధ్యప్రదేశ్‌లో కుప్పకులాయి. కుప్పకూలిన వాటిలో సుఖోయ్-30, మిరాజ్ 2000 యుద్ద విమానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాల అక్కడికి చేరుకున్నాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు  కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రెండు విమానాలు శిక్షణ, విన్యాసాల కోసం బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో అవి ఒకదానికొకటి ఢీకొని కూలిపోయాయి.

శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సుఖోయ్-30 నుంచి పైలట్‌లు సురక్షితంగా బయటపడ్డారని.. వారికి స్వల్ప గాయాలయ్యాయని  వారు తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?