మానీలాండరింగ్ కేసులో మండోలి జైలులో మగ్గుతున్న సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉద్దేశించి ఓ లేఖ రాశాడు. ఇక తాను అన్ని నిజాలూ భయటపెట్టబోతున్నాని పేర్కొన్నారు. ఎవరి కోసమైతే ఇంత కాలం అన్నీ దాచానో వారే తనను చెడ్డవాడినని చెబుతున్నారంటూ ఆ లేఖలో అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
హై ప్రొఫైల్ మోసం కేసులో మండోలి జైలులో ఉన్న దుండగుడు సుకేష్ చంద్రశేఖర్ సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఓ లేఖ రాశాడు. ఆమె పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించనప్పటికీ.. ఆ లేఖ చదివితే ఫెర్నాండెజ్ ను ఉద్దేశించి రాసేందని అని స్పష్టమవుతోందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే వాస్తవానికి సుకేష్ చంద్రశేఖర్‌కు ఎలాంటి లేఖ ఇవ్వకుండా ఆపాలని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోర్టులో విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈడీని కోర్టు స్పందన కోరింది. ఈ విషయం తెలిసిన చంద్రశేఖర్ జైలు నుంచే తాజా లేఖను విడుదల చేశాడు.
లేఖలో ఏముందంటే ?
‘‘నేను కలలో కూడా దీనిని ఊహించలేదు, కానీ హృదయం ముక్కలవాడానికే తయారైందని నాకు అర్థమైంది. ఫీలింగ్స్ ఎవరికైనా చాలా ముఖ్యమైనవి. నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నేను ఎవరినైతే రక్షించాలని అనుకున్నానో వారే నాకు ఎదురు తిరిగారు. వారే నా వీపు మీద బలంగా కొట్టారు. ఎందుకంటే వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. ఆమె బాధితురాలిగా పేర్కొంటూ, బ్లేమ్ గేమ్ ప్రారంభించింది. నన్ను ఓ డెవిల్ గా, చెడ్డవాడిగా చూపించాలని అనుకుంటోంది.’’ అని పేర్కొన్నారు.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చర్య తనను చెడ్డవాడిగా మార్చిందని, దీంతో తనకు వాస్తవాలను వెల్లడించడం తప్ప మరో మార్గం లేదని సుకేష్ చంద్రశేఖర్ తన ప్రకటనలో తెలిపారు. ‘‘కాబట్టి ఈ ముక్కలైన హృదయంతో తాను మౌనంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. నిజం చాలా శక్తివంతమైనదని తెలుసుకోడానికి ఇప్పుడు సమయం వచ్చింది. ప్రపంచం నిజం, వాస్తవికత తెలుసుకోవాలి. ఇప్పుడు నేను దేనినైనా బహిర్గతం చేయడానికి సాధ్యమైనదంతా చేస్తాను.’’ అని పేర్కొన్నాడు.
జాక్వెలిన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇవ్వబోతున్నాని సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో తెలిపాడు. చాట్‌లు, స్క్రీన్‌షాట్లు, రికార్డింగ్‌లు, విదేశీ పెట్టుబడులు, లావాదేవీలను సాక్ష్యంగా సమర్పించాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఏజెన్సీలు చాలాసార్లు ప్రశ్నించాయి. ఒకసారి ఏజెన్సీలు ఇద్దరినీ ముఖాముఖికి తీసుకొచ్చాయి. ఇందులో జాక్వెలిన్‌కు డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్‌లు, కార్లు, వజ్రాలు తదితర ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తేలింది. ఈడీ ప్రకారం.. సుఖేష్ జాక్వెలిన్‌కు దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చాడు. అందులో 52 లక్షల రూపాయల విలువైన గుర్రం, 9 లక్షల రూపాయల విలువైన పెర్షియన్ పిల్లి కూడా ఉన్నాయి.