Sudha Murty : 'నాపేరు చెప్పి డబ్బులు వసూల్ చేస్తున్నారు'... సుధామూర్తి ఫిర్యాదు 

Sudha Murty: యుఎస్‌లో జరిగిన రెండు వేర్వేరు ఈవెంట్‌లకు సంబంధించి తన పేరును దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై రచయిత్రి సుధా మూర్తి తన అసిస్టెంట్ ద్వారా ఫిర్యాదు చేశారు.

Sudha Murty files complaint alleging misuse of her name in US events KRJ

Sudha Murty: సుధా మూర్తి .. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ గా, రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా అందరికీ సుపరిచితమే.. అయితే.. అమెరికాలో జరిగే ఈవెంట్లకు ఆమె హాజరవుతారని పేర్కొంటూ కొందరూ డబ్బులు వసూలు చేశారంట. ఈ విషయం తన ద్రుష్టికి రావడంతో  తీవ్రంగా స్పందించారు సుధారాణి. తన పేరును దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో బెంగళూరు నగర పోలీసులు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు మూర్తి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మమతా సంజయ్ శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో జయనగర్ పోలీసులు లావణ్య, శృతి అనే ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం.. ఉత్తర కాలిఫోర్నియా (కెకెఎన్‌సి) కన్నడ కూట 50వ వార్షికోత్సవానికి హాజరు కావాలని సుధా మూర్తిని ఆహ్వానించారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 5న ఆమె కార్యాలయానికి ఇమెయిల్ ఆహ్వానం అందింది. అయితే..తనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కాలేనని ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది.
 
అయినప్పటికీ..సుధా మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తప్పుడు ప్రచారం నిర్వహించారు ఆ కార్యక్రమ నిర్వహకులు. ఈ ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను చూసిన సుధామూర్తి తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ విషయమై KKNC నిర్వాహకులను సంప్రదించగా.. తాను సుధామూర్తి  వ్యక్తిగత కార్యదర్శినని చెప్పినట్టు లావణ్య అనే మహిళ మోసం చేసినట్టు గుర్తించారు.  
 
పోలీస్ అధికారి ప్రకారం.. లావణ్య - సుధామూర్తి ట్రస్ట్ యొక్క సిబ్బంది అని చెప్పుకునేవారు . సుధామూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు ధృవీకరించినట్లు ఆగస్టు మొదటి వారంలో నిర్వాహకులకు చెప్పారు.

Latest Videos

రెండవ సంఘటనలో.. సుధా మూర్తి USAలో ఒక కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొంటూ శ్రుతి అనే మహిళ నిర్వహకుల నుండి US $ 40 వసూలు చేసింది. సెప్టెంబర్ 26న 'డాక్టర్ సుధా మూర్తితో మీట్-అండ్-గ్రీట్' అనే ప్రకటనను మూర్తి కార్యాలయం చూసింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటనలో పేర్కొంది. దీంతో అప్రమత్తమైన సుధామూర్తి పోలీసులను ఆశ్రయించింది.  

ఈ క్రమంలో జయనగర్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419, 420, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66(సి), 66(డి) కింద కేసు నమోదు చేశారు. అయితే.. నిందిత మహిళలు USAలో ఉన్నారా? లేదా భారతదేశంలో ఉన్నారా? అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

vuukle one pixel image
click me!