Prithvi-2 Missile : పృథ్వీ-2 బాలిస్టిక్‌ మిస్సైల్‌ పరీక్ష విజ‌యవంతం..

Published : Jun 16, 2022, 12:58 AM IST
Prithvi-2 Missile : పృథ్వీ-2 బాలిస్టిక్‌ మిస్సైల్‌ పరీక్ష విజ‌యవంతం..

సారాంశం

Prithvi-2 Missile : ఒడిశాలోని చాందీపూర్‌లోని పరీక్షా కేంద్రం నుంచి జూన్ 15న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను DRDO విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  

Prithvi-2 Missile : పృథ్వీ-2 బాలిస్టిక్‌ మిస్సైల్ ( Prithvi-2 Missile) ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. బుధ‌వారం ఒడిశా- బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సెంటర్ నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2( Prithvi-2 Missile)ను విజయవంతంగా పరీక్షించారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పృథ్వీ-2 క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్ష సమయంలో క్షిపణి సూచించిన అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను కలిగి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సెంటర్ నుంచి జూన్ 15న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. పృథ్వీ-II క్షిపణి (Prithvi-2 Missile) వ్యవస్థ అత్యంత విజయవంతమైనదిగా పరిగణించబడింది. చాలా ఎక్కువ ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించగలదని పేర్కొన్నారు.

ఈ క్షిపణిని గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లలో కూడా విజ‌య‌వంతంగా పరీక్షించిన విష‌యం తెలిసిందే. అణుశక్తితో కూడిన ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలానికి క్షిపణులను ప్రయోగించగలదు. గతేడాది నవంబర్ 20న రాత్రి ఒడిశా తీరం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. 350 కి.మీ స్ట్రైక్ రేంజ్ కలిగిన ఈ క్షిపణిని రాత్రి 7 గంటల నుండి 7.15 గంటల మధ్య లాంచ్ కాంపాక్ట్-3 నుండి మొబైల్ లాంచర్‌తో ప్రయోగించారు.

పృథ్వీ-2 (( Prithvi-2 Missile)) 500 నుంచి 1,000 కిలోల బరువున్న ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి 300 కి.మీ పరిధిని కలిగి ఉండే ఈ క్షిపణిలో రెండు ద్రవ ఇంధన ఇంజన్లు ఉన్నాయి. ఇది ద్రవ, ఘన ఇంధనాల ద్వారా శక్తిని పొందుతుంది.

ట్రైనింగ్‌ లాంచ్‌లో మిస్సైల్‌ కచ్చిత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 9 మీటర్ల పొడవు, సింగిల్-స్టేజ్ ద్రవ ఇంధనంతో పనిచేసే పృథ్వీ-2 మిస్సైల్‌ తొలిసారిగా 1996లో ప్రయోగించారు. 2003లో భారత సాయుధ దళాలలోకి ప్రవేశించింది. DRDO అభివృద్ధి చేసిన మొదటి క్షిపణి ఇదే.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?