
Sexual Harassment: చిన్నారులు, మహిళ సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నికఠిన చట్టాలు తీసుకుంటున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదోక చోట కామాంధుడు చేతిలో అమాయకురాలు బలవుతూనే ఉన్నారు. తాజాగా లైంగిక వేధింపుల కారణంగా మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురై..విసిగి వేసారి.. మనస్తాపానికి గురైన ఓ యువతి భవనం మీది నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు విస్తుకొలిపే విషయాలు తెలిశాయి. ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలని గత 18 నెలలుగా కొందరూ యువకులు బ్లాక్ మెయిల్ చేస్తూ.. లైంగిక వేధింపులకు(Sexual Harassment) పాల్పడుతున్నారు. ఆ నిందితుల్లో ఓ తన ప్రాణ స్నేహితురాలు ఉండటం గమనార్హం. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలోని కళ్యాణ్‌లో జరిగింది.
లైంగిక వేధింపుల Sexual Harassmentతో విసిగి వేసారిన కాలేజీ విద్యార్థిని నివాస భవనం మూడు అంతస్తుల నుంచి దూకి జీవితాన్ని ముగించుకుంది. గత ఏడాదిన్నర కాలంగా ఏడుగురు యువకులు బాలికను ఆమె స్నేహితురాలి సహాయంతో లైంగికంగా వేధిస్తూ(Sexual Harassment) వీడియోను వైరల్ చేస్తానని బెదిరించారు. ఈ కేసులో మృతుడి స్నేహితురాలు, 7 మంది యువకులతో సహా మొత్తం 8 మందిని కోల్షెవాడి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం వారందరినీ జూన్ 20 వరకు పోలీసు కస్టడీకి పంపింది.
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం..కోల్సేవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం 18 ఏళ్ల యువతి ఓ నివాస భవనంలోని మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో బాలిక మొబైల్‌ను పరిశీలించిన పోలీసులకు విస్తుకొలిపే నిజాలు తెలిశాయి.
దర్యాప్తులో బాలిక మొబైల్‌లో సూసైడ్ నోట్ దొరికిందని కోల్‌షెవాడి పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బషీర్ షేక్ తెలిపారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించామనీ, కళ్యాణ్ ఈస్ట్‌లో నివసిస్తున్న ఏడుగురు యువకులు గత ఏడాదిన్నరగా బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. లైంగిక వేధింపులకు(Sexual Harassment) పాల్పడుతున్నారని, తమ కోరిక తీర్చకపోతే.. తన నగ్న వీడియోలను ఇంటర్ నెట్ లో పెట్టి వైరల్ చేస్తానని బెదిరించారు.
ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ ఏడుగురు నిందితులకు ఓ యువతి సాయం చేస్తోంది. ఆ యువతి ఎవరో కాదు.. బాధితురాలి ప్రాణ స్నేహితురాలు కావడం గమనార్హం. నిందితులను అదుపులో తీసుకున్న కోల్‌షెవాడి పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. అమ్మాయి స్నేహితురాలు కాజల్ జైస్వాల్, సన్నీ, విజయ్ యాదవ్, ప్రమీర్ తివారీ, శివం పాండే, కృష్ణ జైస్వాల్, ఆనంద్ దూబే, నిఖిల్ మిశ్రా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కోర్టులో నిందితులను జూన్ 20 వరకు పోలీసు కస్టడీకి పంపించాలని ఆదేశించింది. కోల్షేవాడి పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు.