మమ్మల్నే డబ్బులు అడుగుతావా .. దుకాణదారుడిపై పోలీసుల ఆగ్రహం, ఎస్ఐ సహా ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్

By Siva KodatiFirst Published Jun 7, 2023, 5:33 PM IST
Highlights

జ్యూస్ తాగి, ఎగ్ ఆమ్లేట్ తిని దానికి బిల్లు చెల్లించమని కోరిన దుకాణదారుడిపై పోలీసులు తిరగబడటం తమిళనాడులో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఓ ఎస్సై సహా ముగ్గురు కానిస్టేబుళ్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 
 

కొన్ని సినిమాల్లో పోలీసులు తిన్న వాటికి, కొన్న వాటికి డబ్బులు ఇవ్వకపోడం, మామూళ్లు వసూలు చేయడం చూస్తూనే వుంటాం. తాజాగా తమిళనాడులో అచ్చం ఇదే ఘటన జరిగింది. బ్రెడ్ ఆమ్లేట్, జ్యూస్ తాగిన పోలీసులు.. దుకాణదారుడికి ధర చెల్లించలేదు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దాకా వెళ్లడంతో వారిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చెంగల్పట్లు జిల్లా గుడువాంచేరికి చెందిన సబ్ ఇన్స్‌పెక్టర్ విజయలక్ష్మీ, ముగ్గురు కానిస్టేబుళ్లు స్టేషన్‌కు సమీపంలోని జ్యూస్ సెంటర్‌ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా బ్రెడ్ ఆమ్లేట్, జ్యూస్, వాటర్ బాటిల్స్ ఆర్డర్ చేశారు. తిన్న వాటికి , తాగిన వాటికి డబ్బు చెల్లించాలని దుకాణదారుడు అడగ్గా.. విజయలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మమ్మల్నే డబ్బు అడుగుతావా.. నీ షాప్ లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరించింది. 

దీనిపై దుకాణదారు మణిమంగళం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే విజయలక్ష్మీతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లను తాంబరం కమీషనర్ అమల్‌రాజ్ సస్పెండ్ ‌చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!