గుజరాత్ యూనివర్సిటీలో నమాజ్ చేసిన విద్యార్థులు.. వీడియో వైరల్ కావడంతో వివాదం..

By SumaBala BukkaFirst Published Dec 27, 2022, 7:29 AM IST
Highlights

గుజరాత్ లోని ఎంఎస్ యూ యూనివర్సిటీలో పరీక్ష రాయడానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులు నమాజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం రాజుకుంది. 

గుజరాత్ : గుజరాత్లోని వడోదరలో ఉన్న ఓ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థులకు చెందిన ఓ వీడియో కలకలం రేపింది. ఇద్దరు విద్యార్థులు  యూనివర్సిటీలో నమాజ్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వివాదాస్పదంగా మారింది. వడోదరలోని ఎంఎస్ యు (మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం)లో  ఈ ఘటన చోటుచేసుకుంది క్యాంపస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఇద్దరు విద్యార్థులు నమాజ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిపై క్యాంపస్లో వివాదం రాజుకుంది. దీంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యాసంస్థల్లో నమాజ్ చేయకూడదని విద్యార్థులకు కౌన్సిలింగ్ చేస్తామని తెలిపారు. మరోవైపు, యూనివర్సిటీలో నమాజ్ చేయడంపై విశ్వహిందూ పరిషత్ మండిపడింది. దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించింది. నమాజ్ చేసిన ప్రాంతంలో వీహెచ్ పీ కార్యకర్తలు గంగాజలాన్ని చల్లారు. ఆ ఘటన జరిగిన స్థలంలో ‘రామ్-ధున్’ నిర్వహించారు. ఇక హిందూ కార్యకర్తలు యూనివర్సిటీ బయట  హనుమాన్ చాలీసా చదివారు.

వీక్లీ మార్కెట్ లో నమాజ్ చేసినందుకు 8 మంది అరెస్టు.. ఉత్త‌రాఖండ్ లో ఘ‌ట‌న

మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం క్యాంపస్లోని జనరల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్  దగ్గర్లో ఈ ఘటన జరిగింది. సోమవారం ఉదయం   ఈ వీడియోలో చిత్రీకరించారు. ఇందులో ఇద్దరు యువకులు నమాజ్ చేస్తూ ఉండడం కనిపిస్తుంది. కాసేపటికే దీని గురించి యూనివర్సిటీ బృందానికి తెలిసింది. వెంటనే వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. యూనివర్సిటీ భవనంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ వీడియో వల్ల శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అనుమానించి.. పోలీసులను పిలిపించారు. ఈ మేరకు ఎమ్మెస్ విశ్వవిద్యాలయం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లకులీష్ త్రివేది తెలిపారు. వారిద్దరూ బీకాం సెకండ్ ఇయర్ విద్యార్థులని.. ఎగ్జామ్ రాయడానికి  వచ్చారని.. ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లే ముందు నమాజ్ చేశారని తెలిపారు. అయితే దీనిపై వడోదరలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా మాట్లాడుతూ..  ఎడ్యుకేషన్ క్యాంపస్లలో నమాజులో చేయొద్దని అన్నారు. 

click me!