విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించిన టీచర్లు.. వీడియో వైరల్..

Published : Jul 27, 2022, 12:35 PM IST
విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించిన టీచర్లు.. వీడియో వైరల్..

సారాంశం

కర్ణాటకలో విద్యార్థులతో స్కూల్ టాయిలెట్లు కడిగించారు టీచర్లు.  ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో సదరు టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

కర్ణాటక : Karnataka రాష్ట్రంలోని గడగ్ జిల్లా నాగవిలో పాఠశాల విద్యార్థినులు toiletను శుభ్రం చేస్తున్న viral videoగా మారింది. ఈ వీడియోను స్కూల్ వంట మనిషి వాట్సాప్ లో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె మీద ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన స్కూల్ లో వంటమనిషి విజయలక్ష్మి చలవాడి మాట్లాడుతూ, తాను జూలై 12న ఈ వీడియో తీశానని చెప్పుకొచ్చింది. ఆ రోజు "పిల్లలు నా వద్దకు వచ్చి టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి బకెట్, చీపురు అడిగారు. టీచర్లు ఆ పని చేయమన్నారని చెప్పారు. నాకెందుకో అది సరైంది కాదనిపించింది. అందుకే వీడియో తీశాను.  నా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశాను ”అని ఆమె వివరించింది.

ఈ వీడియో వైరల్ కావడంతో, కాంట్రాక్ట్ పద్ధతిలో పాఠశాలలో పనిచేస్తున్న వంట మనిషి ఉపాధ్యాయులు, అధికారుల టార్గెట్‌గా మారింది. కానీ గ్రామస్తులు ఆమెకు మద్దతు పలికారు. మరుగుదొడ్లు శుభ్రం చేయమని పిల్లలను ఎలా అడుగుతారు అని అడుగుతున్నారు. వంట మనిషి తప్పులేదు. ఇలాంటివి ఇక ముందు జరగకుండా అధికారులు ఉపాధ్యాయులను హెచ్చరించాలి' అని పేరు చెప్పడానికి ఇష్టపడని గ్రామస్థుడు అన్నారు.

వివాహేతరసంబంధం నిరాకరించిందని.. మరదలి గొంతుకోసి చంపిన బావ..

పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో అగంతకులు ఆవరణలోకి ప్రవేశించి సిగరెట్ పీకలు, గుట్కా ప్యాకెట్లు, మద్యం బాటిళ్లతో అపరిశుభ్రం చేస్తున్నారని విజయలక్ష్మి తెలిపారు. "వారు కొన్నిసార్లు టాయిలెట్‌ను వాడుతున్నారు. అప్పుడు విద్యార్థులెందుకు శుభ్రం చేయాలి? నేను ఇది ఏ సిబ్బందినో లేదా అధికారినో టార్గెట్ చేయాలని తీయలేదు. నేను ఆ వీడియోను రికార్డ్ చేసినప్పుడు విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకున్నాను. కానీ విద్యా శాఖ అధికారుల రియాక్షన్ తో విసిగిపోయాను.. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే వారిపై న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను' అని విజయలక్ష్మి అన్నారు.

కాంపౌండ్‌ వాల్‌ నిర్మిస్తున్నామని ఉపాధ్యాయులు విద్యార్థులను బలవంతం చేశారని నాగవి సామాజిక కార్యకర్త శరణప్ప చించలి ఆరోపించారు. "తమ తప్పును దాచడానికి, అధికారులు ఒక అమాయక వంటమనిషికి లక్ష్యంగా చేసుకుంటున్నారు," అని అతను చెప్పాడు. సంఘటన జరిగిన రోజు  తాను పాఠశాలలో లేనని ప్రధానోపాధ్యాయుడు కెసి నభాపూర్ తెలిపారు. జూలై 21న మాకు ఈ విషయం తెలిసింది. వంట మనిషి వీడియో తీసిందని పిల్లలు చెప్పారు. ఆ రోజు సాంఘిక సంక్షేమ అధికారులు పాఠశాలకు వెళ్లినప్పుడు విద్యార్థులు మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న వీడియో వారి వద్ద ఉంది. 

జూలై 22న జెడ్పీ సీఈవో సందర్శించారు. వీడియోలో కనిపిస్తున్న విద్యార్థులతో పాటు.. విద్యార్థులకు ఆ పని సూచించిన ఉపాధ్యాయులతోనూ సంభాషించారు. సీఈఓ ఆదేశాల మేరకు డీడీపీఐ నాకు షోకాజ్ నోటీసు జారీ చేయగా.. నేను ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశాను" అని తెలిపారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu