బాలికలు హిజాబ్ ధరించి స్కూల్ కు రావడాన్ని సమర్థించిన విద్యార్థి.. చితకబాదిన రైట్ వింగ్ గ్రూప్.. త్రిపురలో ఘటన

Published : Aug 05, 2023, 02:46 PM IST
బాలికలు హిజాబ్ ధరించి స్కూల్ కు రావడాన్ని సమర్థించిన విద్యార్థి.. చితకబాదిన రైట్ వింగ్ గ్రూప్.. త్రిపురలో ఘటన

సారాంశం

త్రిపురలో హిజాబ్ వివాదంతో ఉద్రిక్తత నెలకొంది. బాలికలు హిజాబ్ ధరించి పాఠశాలకు రావడాన్ని ఓ వర్గం సభ్యులు వ్యతిరేకించగా.. మరో విద్యార్థి దానిని సమర్థించాడు. దీంతో ఆ విద్యార్థిని మరో వర్గానికి చెందిన సభ్యులు చితకబాదారు. సెపాహిజాలా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

బాలికలు హిజాబ్ ధరించడం విషయంలో మొదలైన గొడవ త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసింది. ముస్లిం వర్గానికి చెందిన పలువురు బాలికలు హిజాబ్ ధరించి పాఠశాలకు వెళ్లడాన్ని రైట్ వింగ్ గ్రూప్ వ్యతిరేకించింది. దీనిని ఓ విద్యార్థి నిరసించాడు. పలువురి విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగాడు. దీంతో అతడిని ఆ గ్రూపు సభ్యులు చితకబాదారు.

జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్ పై 5.2 తీవ్రత నమోదు..

‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం.. సెపాహిజాలా జిల్లాలోని బిషల్‌ఘర్ సబ్‌డివిజన్‌ లోని ఓ స్కూల్ కు వారం రోజుల కిందట ఓ రైట్ వింగ్ సంస్థతో సంబంధం కలిగి ఉన్న, అదే పాఠశాలలో గతంలో చదివిన విద్యార్థుల బృందం వచ్చింది. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను పాఠశాల ఆవరణలోకి అనుమతించకూడదని ఆందోళన చేసింది. అనంతరం ప్రధానోపాధ్యాయుడిని కూడా ఈ విషయంలో అభ్యర్థించింది. ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫారాన్ని ధరించడం లేదని, హిజాబ్ పై నిషేధం అమలు చేయాలని ఆ బృందం కోరింది.

అయితే ఈ నిబంధనపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో పాఠశాలలో హిజాబ్ ధరించరాదని ప్రధానోపాధ్యాయుడు ప్రియతోష్ నంది ముస్లిం బాలికలకు మౌఖికంగా తెలియజేశారు. అయితే దీనిని ఆ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థి వ్యతిరేకించాడు. మరి కొందరు విద్యార్థులతో కలిసి ప్రధానోపాధ్యాయుడి గదిని ధ్వంసం చేశాడని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.

మణిపూర్ లో మళ్లీ హింస.. ముగ్గురిని కాల్చి చంపిన దుండగులు..

ఈ విషయం తెలియడంతో రైట్ వింగ్ గ్రూపు సభ్యులు పాఠశాల బయట ఆ విద్యార్థి కోసం ఎదురు చూడసాగారు. హిజాబ్ ధరించడాన్ని సమర్థించిన ఆ విద్యార్థి బయటకు వచ్చిన వెంటనే చితకబాదారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసు బలగాలు మోహరించాయి. ముందు జాగ్రత్త చర్యగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ పాఠశాల తరగతులను నిలిపివేశారు. 

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి సానియా వివరాలు తొలగించిన షోయబ్‌ మాలిక్.. మళ్లీ మొదలైన విడాకుల ఊహాగానాలు..

అయితే ఇది మతపరమైన సమస్య కాదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ట్వీట్ చేశారు. రాష్ట్ర అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని, సమస్యను పరిష్కరించడానికి, ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?