ప్రియురాలి ముద్దు కోసం యువకుడి సాహసం.. అరెస్ట్

Published : Feb 21, 2019, 11:27 AM IST
ప్రియురాలి ముద్దు కోసం యువకుడి సాహసం.. అరెస్ట్

సారాంశం

ప్రియురాలు ఇచ్చే ముద్దు కోసం.. సాహసానికి ఒడిగట్టి.. ఓ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసుల చేతిలో దేహశుద్ది కూడా తప్పలేదు

ప్రియురాలు ఇచ్చే ముద్దు కోసం.. సాహసానికి ఒడిగట్టి.. ఓ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసుల చేతిలో దేహశుద్ది కూడా తప్పలేదు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఇంతకీ మ్యాటరేంటంటే..

తమిళనాడులోని పట్టాభిరామ్ తండురై గ్రామం పల్లవీధికి చెందిన శక్తివేల్(22) అన్నాసాలైలోని ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్ ట్రస్ట్ తరపున ఉద్యోగ శిక్షణలో ఉన్న ఓ యువతితో శక్తివేల్ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే.. శక్తివేల్.. తన ప్రేయసిని ఓ కోరిక కోరాడు.

వాలంటైన్స్ డే రోజున ముద్దు కోవాలని ప్రేయసిని కోరాడు. అందుకు ఆ యువతి నిరాకరించింది. శక్తివేల్ బ్రతిమిలాడటంతో ఓ కండిషన్ తో ముద్దు ఇవ్వడానికి అంగీకరించింది. బురఖా ధరించి రాయపేట నుంచి మెరీనా బీచ్ వరకు రావాలని పందెం కాసింది. అలా చేస్తే ముద్దు ఇస్తానని చెప్పింది. దీంతో.. శక్తివేల్ బురఖా వేసుకొని అలానే చేశాడు.

అయితే.. అతని తీరు చుట్టుపక్కల వారికి అనుమానం కలిగించింది. అంతే.. వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వాళ్లు దేహశుద్ది చేయడంతో.. శక్తివేల్ అసలు నిజం బయటపెట్టాడు. అది విని పోలీసులు కూడా అవాక్కయ్యారు. అనంతరం అతనిని వదిలిపెట్టారు.
 

PREV
click me!

Recommended Stories

Tamil Nadu CM Vijay: సామాన్యుడిలా బస్సులో ప్రయాణిస్తూ వీడియో తీసుకున్న సీఎం విజయ్| Asianet Telugu
Arunachal Pradesh Flood: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు కొట్టుకుపోయిన ఇళ్లు, వాహనాలు| Asianet Telugu