హిమాచల్ ప్రదేశ్‌లో ప్రమాదం...ఆరుగురు జవాన్ల మృతి

By Arun Kumar PFirst Published Feb 20, 2019, 7:57 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో విపరీతంగా కురుస్తున్న మంచు ఆరుగురు భారత జవాన్లను బలితీసుకుంది. జిల్లాలోని నంగ్య రీజియన్ లో జవాన్లు విధుల్లో వున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. సరిగ్గా కొండచరియలు జవాన్లపై  పడటంతో వాటి కింద కూరుకుపోయి ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. 

గతకొంత కాలంగా హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో కొండ ప్రాంతాల్లో మంచు భారీగా పేరుకుపోయింది. అయితే ఇలా ఏర్పడిన మంచు చరియలు కొండలపై నుండి విరిగిపడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఛంబ, సిమ్లా, కిన్నౌర్‌, కులు వంటి ప్రాంతాలకు ఈ ప్రమాదం పొంచివుందని హెచ్చరించారు. దీంతో కొండ ప్రాంతాలకు దగ్గర్లోని నివాసముండే కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

అయితే నంగ్య రీజియన్ లో ఆర్మీ జవాన్లతో పాటు స్థానికి పోలీసులు భద్రతా విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డారు. దీంతో వాటికింద చిక్కుకుని ఆరుగురు జవాన్లు మృతిచెందగా మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొండచరియలను తొలగించి వాటికింద నుండి జవాన్లను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. 
 
click me!