ఫ్లిప్ కార్ట్ హబ్ లో... 150స్మార్ట్ ఫోన్లు చోరీ

By ramya NFirst Published 21, Feb 2019, 10:25 AM IST
Highlights

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు చెందిన 150 స్మార్ట్ ఫోన్లు చోరీకి గురయ్యాయి.


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు చెందిన 150 స్మార్ట్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీ శివారులోని అలీపూర్ ఫ్లిప్ కార్ట్ డెలివరీ హబ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 19వ తేదీన మొబైల్ ఫోన్లను డెలివరీ హబ్ నుంచి బిలాస్ పూర్ లోని వేరే హౌస్ కి తరలించే క్రమంలో  ఓముఠా చాలా తెలివిగా స్మార్ట్ ఫోన్లను కొట్టేసింది. కాగా.. ఫ్లిప్ కార్ట్ హబ్ సెక్యురిటీ అధికారి వెంటనే తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఓ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముఠా నాయకుడు సంతోష్ తోపాటు బ్రీజ్ మోహన్, అఖిలేష్, రంజిత్ లు ఉన్నారు. నిందితులు గత కొంతకాలంగా పలు ట్రాన్స్ పోర్ట్ కంపెనీలలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు. మొత్తం 150 స్మార్ట్ ఫోన్లు చోరీ చేయగా.. వాటిలో నుంచి 30 స్మార్ట్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Last Updated 21, Feb 2019, 10:25 AM IST