ఇల్లినాయిస్, మిడ్‌వెస్ట్‌లోని చాలా ప్రాంతాల్లో జనవరి చివరి భాగంలో భయంకరమైన చలి, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలి చలి -20 డిగ్రీల నుండి -30 డిగ్రీల మధ్య తగ్గుదల నమోదు చేసింది.
అమెరికా : అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్‌లో 18 ఏళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థి అకుల్ ధావన్ గత నెలలో చలికి గడ్డకట్ి మరణించాడు. దానికి ముందు కొన్ని గంటలపాటు అతను కనిపించకపోవడంతో వెతికారు. మృతి చెందిన విషయం వెలుగు చూసింది. ఈ వారం ఇల్లినాయిస్‌లోని ఛాంపెయిన్ కౌంటీ కరోనర్ కార్యాలయం, భారతీయ-అమెరికన్ విద్యార్థి "తీవ్రమైన ఆల్కహాల్ మత్తు, గడ్డకట్టే అతి తక్కువ ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు ఉండడం వల్ల మరణించినట్లుగా’ పేర్కొంది.
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పశ్చిమ ఉర్బానాలోని యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలోని భవనం వెనుక వరండాలో విద్యార్థి మృతదేహాన్ని జనవరి 20న కనుగొన్నారు. మృతదేహం కనుగొనబడినప్పుడు అతి తక్కువ ఉష్ణోగ్రతలకు మరణించిన సంకేతాలు కనిపించాయి. అయితే, మరణానికి ఖచ్చితమైన కారణం ముందుగా క్యాంపస్ పోలీసులచే విచారణలో ఉంది.
undefined
నేడు ‘బ్లాక్ ఫ్రై డే’.. ఎందుకో తెలుసా ?
జనవరి 20న అకుల్ స్నేహితులతో కలిసి డ్రింక్స్ కోసం బయటకు వెళ్లాడు. రాత్రి 11:30 గంటల సమయంలో, అతను, అతని స్నేహితులు క్యాంపస్‌కు దగ్గరగా ఉన్న కానోపీ క్లబ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. క్లబ్‌లోని సిబ్బంది అతడిని లోపలికి రానివ్వలేదు. అతను క్లబ్‌లోకి "పలుసార్లు" ప్రవేశించడానికి ప్రయత్నించాడు, కాని సిబ్బంది పదేపదే తిరస్కరించారు" అని సమాచారం.
అంతేకాదు అతడిని అక్కడినుంచి పంపించడానికి పిలిచిన రెండు రైడ్‌షేర్ వాహనాలను కూడా తిప్పి పంపాడని కాన్సాస్ సిటీ నివేదించింది. ఇల్లినాయిస్, మిడ్‌వెస్ట్‌లోని చాలా ప్రాంతాలు జనవరి చివరి భాగంలో క్రూరమైన చలి, గడ్డకట్టే ఉష్ణోగ్రతలను అనుభవించాయి. గాలి చలి -20 నుండి -30 డిగ్రీల మధ్య తగ్గుతూ వస్తోంది.
ఆ తరువాత అతని సమాచారం లేకపోవడంతో స్నేహితులు అనేక సార్లు ఫోన్లు చేశారు. కానీ, వేటికీ రెస్పాన్స్ రాలేదు. అతనిని వెతకడానికి ఒక స్నేహితుడు క్యాంపస్ పోలీసులను సంప్రదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక అధికారి ధావన్ కోసం, అతడిని తిరిగి క్యాంపస్‌కు తిరిగి తీసుకువెళ్లడానికి వెతకడం ప్రారంభించాడు.
కాసినో క్లబ్ నుంచి క్యాంపస్ కు వెళ్లే దారి గుండా.. నెమ్మదిగా వాహనాన్ని నడుపుతూ అతని కోసం వెతికాడు, కానీ అతని జాడ తెలియలేదు. మరుసటి రోజు ఉదయం, యూనివర్సిటీలోని ఒక ఉద్యోగి "భవనం వెనుక వరండాలో ఒక వ్యక్తి" ఉన్నట్లు పోలీసులకు, అత్యవసర వైద్య సేవలకు తెలియజేశాడు. దొరికే సమయానికి అతడు చనిపోయాడని పోలీసులు తెలిపారు.
అకుల్ తల్లిదండ్రులు - ఇష్, రీతూ ధావన్ తమ కొడుకు ఫోన్‌లోని లొకేషన్-ట్రాకింగ్ డేటా ఆధారంగా తప్పిపోయినట్లు చెప్పిన ప్రదేశానికి కేవలం 400 అడుగుల దూరంలో తమ కుమారుడు మృతజీవిగా దొరికాడని చెప్పారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో 18 ఏళ్ల ధావన్ రోబోటిక్స్ అధ్యయనం చేయడానికి ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో చేరాడు. తల్లిదండ్రులకు అతను విదేశాల్లో చదువుకోవడం ఇష్టం లేదని సమాచారం.