నిన్న చండీగ‌ఢ్ యూనివ‌ర్సిటీలో.. నేడు ఐఐటీ బాంబే వీడియోల క‌ల‌క‌లం.. అస‌లేం జ‌రుగుతోంది?

By Rajesh KarampooriFirst Published Sep 21, 2022, 12:39 AM IST
Highlights

బాంబే ఐఐటీలో  ఓ సంచ‌ల‌న ఘటన కలకలం రేపింది. యూనివ‌ర్సిటీ క్యాంటీన్ కు చెందిన‌ సిబ్బంది  ఒకరు మహిళల బాత్‌రూంలోకి చొరబడినట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. హాస్టల్‌లోని నైట్ క్యాంటీన్‌లో పనిచేసే ఉద్యోగి పింటూ గారియా (21) వాష్‌రూంలోకి దూరినట్లు అధికారులు తెలిపారు.

పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీలో అస‌భ్య‌క‌ర‌ వీడియోల క‌ల‌క‌లం  మరువకముందే.. బాంబే ఐఐటీలో ఓ సంచ‌ల‌న ఘటన వెలుగులోకి వ‌చ్చింది. ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని క్యాంటీన్ లో ప‌నిచేసే వ్య‌క్తి.. మహిళల బాత్‌రూంలోకి చొరబడినట్లు విద్యార్థినులు ఆరోపించారు. యూనివ‌ర్సిటీలోని నైట్ క్యాంటీన్‌లో పనిచేసే ఉద్యోగి పింటూ గారియా (21) ఆదివారం రాత్రి మహిళల హాస్టల్‌ బిల్డింగ్‌ పైపుల ద్వారా ఎక్కి వాష్‌రూంలోకి దూరినట్లు గుర్తించారు.

విద్యార్థినీలు, హాస్టల్ సిబ్బంది అప్రమత్తం కావడంతో ఆ నిందితుడుని పట్టుకున్నారు. సోమవారం కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అధికారికంగా అరెస్టు చేశారు. అయితే.. నిందితుడు ఎలాంటి ఫొటోలు కానీ, వీడియోలు కానీ తీయలేదని పోలీసులు వెల్లడించారు. పింటూపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎందుకు హాస్ట‌ల్ లోకి దూరాడనే కోణంలో పోలీసులు విచార‌ణ చేసుకున్నారు. 
 
ఇదిలా ఉంటే.. పంజాబ్‌లోని చండీగఢ్‌ వర్సిటీ హాస్టల్‌లో కొందరు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారాయన్న వార్తలు కలకలం రేపడంతో ఆ విద్యార్థినులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. యూనివర్సిటీ హాస్టల్‌లో ఓ విద్యార్థినీ త‌న తోటీ విద్యార్థినుల‌కు తెలియ‌కుండా..వారి అసభ్య‌క‌ర‌ ఫొటోలు తీసి..  త‌న ప్రేమికుడికి షేర్ చేసింద‌నీ, అత‌డు త‌న మ‌రో స్నేహితుడి స‌హాయంతో  ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన‌ట్టు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు వ్య‌క్తుల‌ను, ఓ మహిళను అరెస్టు చేశారు. పోలీసుల నిర్ధారణలను అంగీకరించడానికి నిరాకరించిన విద్యార్థులు తీవ్ర నిరసనలు చేపట్టారు.
 
నిందిత విద్యార్థినీ తన హాస్టల్ మేట్స్‌కి సంబంధించిన దాదాపు 60 అసభ్యకర వీడియోలను చిత్రీకరించి తన ప్రియుడికి ఫార్వార్డ్ చేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని వీడియోలను సోషల్ మీడియా, పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశారని వారు ఆరోపించారు. దీనికి ఎలాంటి ఆధారాలు లేవని, పుకార్లు పుట్టించడం భయాందోళనలకు, నిరసనలకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మహిళా పోలీసుల బృందం విచారణ జరుపుతోంది.

click me!