దారుణం: కోవిడ్ మృతదేహాలను పీక్కుతింటున్న కుక్కలు... స్థానికుల కంటతడి

By Siva KodatiFirst Published Jun 1, 2021, 4:26 PM IST
Highlights

కోవిడ్-19 కారణంగా భారతదేశంలో నానాటికీ పరిస్ధితులు దిగజారిపోతున్న సంగతి తెలిసిందే. వైరస్ సోకిందని తెలిస్తే చాలు ఆ ఇంటి ఛాయలకు కూడా జనం వెళ్లడం లేదు. అన్ని బావున్నప్పుడు ఇంటికొచ్చి పలకరించే వారు సైతం క్లిష్ట పరిస్థితుల్లో ముఖం ఛాటేస్తున్నారు. 

కోవిడ్-19 కారణంగా భారతదేశంలో నానాటికీ పరిస్ధితులు దిగజారిపోతున్న సంగతి తెలిసిందే. వైరస్ సోకిందని తెలిస్తే చాలు ఆ ఇంటి ఛాయలకు కూడా జనం వెళ్లడం లేదు. అన్ని బావున్నప్పుడు ఇంటికొచ్చి పలకరించే వారు సైతం క్లిష్ట పరిస్థితుల్లో ముఖం ఛాటేస్తున్నారు. ఇక కోవిడ్ బాధితులు మరణించినపుడు, వారి మృతదేహాలకు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగడం లేదు. స్వయంగా కుటుంబసభ్యులు, కొడుకులు, కూతుళ్లు సైతం వారిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. కోవిడ్‌తో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర కాశీలో ఉన్న భాగీరథి నదీ పరీవాహక ప్రాంతంలో కేదార్ ఘాట్ ఉంది. ఇక్కడ కోవిడ్ మృతుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే సరిగా కాలని శరీర భాగాలను వీథి కుక్కలు పీక్కు తింటున్నట్లు కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

Also Read:కోవిడ్ -19: విలన్, గబ్బిలాలు లేదా బ్యాట్ లేడీ.. ఈ మిస్టరీ గురించి తెలుసుకొండి..

కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటి మట్టం పెరిగింది. దీంతో మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకుని వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. అధికారులు తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ మృతదేహాలు కోవిడ్ బాధితులవే అయితే ఆ వ్యాధి మరింత వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

click me!