నైరుతి రుతుపవనాలు... దేశవ్యాప్తంగా వర్షపాతం ఎలా వుండనుందంటే: ఐఎండి డిజి ప్రకటన

Arun Kumar P   | Asianet News
Published : Jun 01, 2021, 03:05 PM ISTUpdated : Jun 01, 2021, 03:19 PM IST
నైరుతి రుతుపవనాలు... దేశవ్యాప్తంగా వర్షపాతం ఎలా వుండనుందంటే: ఐఎండి డిజి ప్రకటన

సారాంశం

ఉత్తర, దక్షిణ భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవనుంది ఐఎండి డిజి మృత్యుంజయ్‌ మహాపాత్రా వెల్లడించారు.

న్యూడిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కారణంగా ఉత్తర, దక్షిణ భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవనుంది ఐఎండి డిజి మృత్యుంజయ్‌ మహాపాత్రా వెల్లడించారు. మధ్య భారతదేశంలో మాత్రం సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందన్నారు. ఇక ఈశాన్య భారత రాష్ట్రాల్లో  సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి డిజి ప్రకటించారు.

ఈ నైరుతి రుతుపవనాలతో 101 శాతం వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. పసిపిక్, హిందూ మహాసముద్రాల్లోని నీటి ఉష్ణోగ్రతల ప్రభావం భారతదేశంలో వానాకాలంపై వుంటుందని... అందువల్లే అక్కడి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తున్నామని వాతావరణ శాఖ తెలిపింది. 

ఈ నెల 3వ తేదీన కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కాస్త ఆలస్యమైనా రుతుపవనాలు దేశంలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. యాస్ తుఫాన్  నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశించడానికి దోహదం  చేసిందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం