సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

By Siva KodatiFirst Published Feb 26, 2019, 9:33 AM IST
Highlights

పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన మెరుపుదాడులకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్ టెర్రర్ క్యాంపులపై మెరుపు దాడులకు దిగుతుందని పాకిస్తాన్ ముందుగానే ఊహించింది

పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన మెరుపుదాడులకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్ టెర్రర్ క్యాంపులపై మెరుపు దాడులకు దిగుతుందని పాకిస్తాన్ ముందుగానే ఊహించింది.

అందుకు తగినట్లుగానే ఉగ్రవాదులను ముందుగానే సరిహద్దులు దాటించి పీఓకేలోని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అయితే భారత నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు దీనిపై ఓ కన్నేసి ఉంచాయి.

సర్జికల్ స్ట్రైక్స్‌కు మోడీ నుంచి ఆదేశాలు రాగానే ఇండియన్ ఆర్మీ జూలు విదిల్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో 12 మిరాజ్ యుద్ధ విమానాలు ఎల్‌ఓసీ దాటి వెళ్లాయి.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని అతిపెద్ద ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో చకోటీ, బాలాకోట్, ముజఫరాబాద్‌లలోని మూడు ఉగ్రవాద శిబిరాలతో పాటు మరికొన్నింటిని ధ్వంసమయ్యాయి. 

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

 

click me!