వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై మరోసారి దాడి.. బిహార్‌లో రాళ్లు విసిరేసిన దుండగులు

By Mahesh KFirst Published Jan 21, 2023, 2:40 PM IST
Highlights

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై బిహార్‌లో మరోసారి దాడి జరిగింది. శుక్రవారం సాయంత్రం కతిహర్ జిల్లాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్లు విసిరిన ఘటన చోటుచేసుకుంది. దీనిపై పశ్చిమ బెంగాల్‌లో ఫిర్యాదు నమోదైంది.
 

పాట్నా: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్లు విసిరిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌లోని కతిహర్ జిల్లాలో బలరాంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో 22302 నెంబర్‌ ట్రైన్ పై శుక్రవారం సాయంత్రం కొందరు దుండగులు రాళ్లు విసిరారు. సీ6 బోగీ విండో పేన్ ఈ దాడిలో ధ్వంసమైంది. 

న్యూ జల్‌పైగురి నుంచి హౌరాకు వెళ్లే ట్రైన్ బిహార్ మీదుగా ప్రయాణిస్తుంది. కతిహార్ జిల్లా బర్సోయిలో హాల్టింగ్ ఉన్నది. నార్తీస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పరిధిలోని కతిహర్ రైల్వే డివిజన్‌లో దల్కోలా, టెల్టా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో సీ6 కోచ్ కిటికీ అద్దం ధ్వంసమైంది. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌పీఎఫ్‌కు చెందిన దల్కోలా పోస్టులో ఫిర్యాదు నమోదైంది.

Also Read: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ : ఖమ్మం రైల్వేస్టేషన్‌లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటా పోటీ నినాదాలు

బిహార్‌లో 20 రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. జనవరి 3వ తేదీన కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై కొందరు దుండగులు రాళ్లు విసిరేసిన ఘటన చోటుచేసుకుంది.

click me!