స్టార్టప్ ఇండియా ద్వారా దేశంలో స్టార్టప్ ల సంఖ్య పెరిగిపోతుంది. మహిళల స్టార్టప్ ల సంఖ్య కూడ గణనీయంగా పెరిగింది.
న్యూఢిల్లీ: భారత దేశంలో స్టార్టప్ ఇండియాతో ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామికవేత్తలు తయారౌతున్నారు. స్టార్టప్ ఇండియా ప్రారంభమైన రోజు నుండి ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద సార్టప్ వ్యవస్థగా భారత్ అవతరించింది.
2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడంతో పాటు వ్యవస్థాపకతకు బలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు స్టార్టప్ ఇండియా స్కీమ్ ను ప్రారంభించారు.
2016లో భారత దేశంలో కేవలం 300 మాత్రమే స్టార్టప్ లున్నాయి. కానీ, 2024 నాటికి స్టార్టప్ ల సంఖ్య 1,18, 320కి పెరిగింది. స్టార్టప్ ఇండియా వల్లే ఇది సాధ్యమైంది. భారత దేశంలో 54,569 మంది మహిళలు స్టార్టప్‌లను ప్రారంభించారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ లో మహిళల పాత్ర పెరుగుతుందనేందుకు ఈ గణాంకాలు నిదర్శనం. దేశంలోని 1,14, 902 స్టార్టప్ లలో 54, 569 స్టార్టప్ లు కనీసం ఒక మహిళా డైరెక్టర్ ను కలిగి ఉన్నాయి.
ఇండియాలో టైర్ 2, టైర్ 3 నగరాల్లో కూడ విస్తరిస్తున్నాయి. 45 శాతం కంటే ఎక్కువ స్టార్టప్ లు ఈ నగరాల్లో ఉన్నాయి. గుర్తింపు పొందిన 12.2 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించి ఉపాధి, ఉద్యోగాల కల్పనకు స్టార్టప్ లు దోహదపడుతున్నాయి. ఆర్ధిక వృద్దిని ప్రోత్సహించడంలో వివిధ రంగాల్లో గణనీయమైన ఉద్యోగావకాశాలను అందించడంలో కీలకపాత్రను ఇది నొక్కి చెబుతుంది.