భారత్‌లో ఏటా రూ. 70 లక్షల సంపాదన: ఏడు వృత్తులు ఇవే....

By narsimha lodeFirst Published Jan 15, 2024, 9:35 PM IST
Highlights

 భారత దేశంలో ఏడు వృత్తులు చేసుకొనే వారికి భారీగా ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది.

న్యూఢిల్లీ: ప్రపంచంలోని పలు దేశాల్లో ఆర్ధిక అనిశ్చితి నెలకొంది. అయినా కూడ  భారత ఆర్ధిక వ్యవస్థ  ముందుకు సాగుతుంది.  భారత దేశంలో  గణనీయమైన వేతనాలు అందించే  వృత్తులు కొన్ని ఉన్నాయి.  కొన్ని వృత్తులు చేపడితే  రూ. 70 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీ నుండి ఫైనాన్స్ వరకు  పలు  వృత్తులు ఇందులో ఉన్నాయి. 

సాఫ్ట్‌వేర్ అర్కిటెక్ట్:  

Latest Videos

సాఫ్ట్ వేర్  డిజైన్లు,  పరీక్షలు, సాఫ్ట్ వేర్ సమస్యలను పరిష్కారాలను రూపొందించడం, సమర్ధత, విశ్వసనీయత, భద్రత రూపొందించడమే  సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్  వృత్తి.సాఫ్ట్ వేర్ అర్కిటెక్స్  సగటు జీతం ఏడాదికి  సుమారు  రూ. 32 లక్షలు. కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధింత రంగంలో  బ్యాచిలర్ డిగ్రీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ‌లు, సాఫ్ట్ వేర్  విభాగంలో నైపుణ్యం కలిగి ఉండాలి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్

ఆర్టిఫిషియల్ లెర్నింగ్ మెషిన్  టెక్నాలజీలను ఉపయోగించి ఇంటలిజెంట్ సిస్టమ్‌లను సృష్టించడంతో పాటు  దాన్ని అమలు చేయాలి.ఏటా  సగటున  రూ. 45 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. (ది మింట్ కథనం మేరకు)అర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పొంది ఉండాలి.

డేటా సైంటిస్ట్

డేటాను  విశ్లేషించడం,  ప్యాట్రన్లను గుర్తించడం, అల్గారిథమ్‌లను  సృష్టించాలి.డేటా సైంటిస్టులకు  ఏటా రూ. 14 లక్షల నుండి  రూ. 25 లక్షల వరకు ఉంటుంది. (ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం మేరకు)డేటా సైన్స్ లోని డిగ్రీని అభ్యసించాల్సి ఉంటుంది. లేదా  ప్రత్యేక కోర్సుల ద్వారా డేటా సైన్స్ లో నైపుణ్యాలను పెంచుకోవాలి.

డిజిటల్ మార్కెటర్

ఎలక్ట్రానిక్ మీడియా మార్కెటింగ్ వ్యూహాలను పర్యవేక్షించడం, డేటా విశ్లేషణకు సృజనాత్మకతను జోడించాల్సి ఉంటుంది.  ప్రతి ఏటా  రూ. 4 నుండి రూ. 18 లక్షల వరకు  ఉంటుంది(యూపీగ్రాడ్ మేరకు)డిజిటల్ మార్కెటింగ్ కోర్సులతో పాటు , మాస్టర్స్ డిగ్రీ లేదా, ఇందుకు సంబంధించిన ప్రత్యేకమైన సర్టిఫికెట్ కోర్సు చేయాల్సి ఉంటుంది.

పైలెట్

ఆశాజనకమైన కెరీర్ అవకాశాలతో  అభివృద్ది చెందుతున్న రంగం ఇది.కమర్షియల్ లేదా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్  కెప్టెన్లు రూ. 9 లక్షల నుండి రూ. 70 లక్షలు సంపాదించుకొనే అవకాశం ఉంది. (ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం)ఏవియేషన్ కోర్సులు చేయడంతో పాటు 10+2 పరీక్షల్లో  భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం సబ్జెక్టులు చదివి ఉండాలి.

గ్రీన్ స్పెషలిస్టులు

వాతావరణ సమతుల్యం కోసం పనిచేయడం, పొల్యూషన్ కారకాలు, వ్యర్థాల నిర్వహణపై  ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా జీతం రూ. 4 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు ఉంటుంది (ఇండియన్స్ ఎక్స్ ప్రెస్ కథనం)గ్రీన్ టెక్నాలజీలో స్పెషలైజేషన్,  ఎస్‌టీఈఎం లో స్కిల్స్ పెంపొందించుకోవాలి.

ఫైనాన్స్ ఫ్రొఫెషనల్స్ (బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, రిస్క్ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్):

ఫైనాన్స్  కు సంబంధించి క్లయింట్లకు  సహాయం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం.బీఎఫ్ఎస్ఐ నిపుణులు ఏటా  రూ. 4 లక్షల నుండి రూ. 34 లక్షలు సంపాదించే  అవకాశం ఉంది.
స్టాక్ మార్కెట్,  మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకింగ్ కార్యకలాపాలపై  నైపుణ్యం పెంచుకోవాలి.

భారత దేశంలో ఈ వృత్తులు ఎంచుకున్న వారు  పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారు.అయితే ప్రతి దానికి నిర్ధిష్ట అర్హతలు, నైపుణ్యం పెంచుకోవడం తప్పనిసరి.టెక్నాలజీ, ఏవియేషన్, గ్రీన్ ఇనిషియేటివ్ , ఫైనాన్స్ రంగంలో ఆర్ధిక పరమైన రివార్డులతో పాటు కెరీర్ ను నిర్మించుకొనే అవకాశాలున్నాయి.
 

click me!