మహిళా దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో బీజేపీ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో తొక్కిసాలట జరగడంతో ఓ మహిళ మరణించింది. ఈ కార్యక్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని శివసేన డిమాండ్ చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగ్‌పూర్‌లో బీజేపీ చేపట్టిన ఓ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. సురేష్ భట్ హాల్‌లో గృహ కార్మికుల కుటుంబాల మహిళలకు కిచెన్ కిట్ లు పంపిణీ చేస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో ఓ మహిళ తీవ్ర గాయాలతో మరణించింది. పలువురికి గాయాలు అయ్యాయి.
గాయపడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరణించిన మహిళనుమను తులషీరామ్ రాజ్‌పుత్ (65)గా గుర్తించారు. ఈ కార్యక్రమం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని శివసేన ఆరోపించించింది.
అసలేం జరిగిందంటే ?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో బీజేపీ నాగపూర్ యూనిట్ మహిళలకు కిచెన్ కిట్ లో పంపిణీ చేయాలని భావించింది. ఈ కార్యక్రమాన్ని మార్చి 8 నుండి మార్చి 10 వరకు సురేష్ భట్ ఆడిటోరియంలో చేపట్టాలని భావించింది. మొదటి రోజు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. అయితే ఈ రోజు (మార్చి 9)న ఆ ఆడిటోరియంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే పలువురు మహిళలు బారులు తీరారు.
7 గంటలకు ఈ రద్దీ మరింత ఎక్కువ అయ్యింది. దీంతో మహిళలంతా గేటు ఎదుట క్యూలో నిలబడ్డారు. ఉదయం 10.30 గంటలకు ఒక్క సారిగా గేటు తీయడంతో మహిళలు ఒకరిని ఒకరు తోసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కింద పడిన పలువరు మహిళలను తొక్కుకుంటూ వెళ్లారు. ఇందులో ఆశీర్వాద్ నగర్‌కు చెందిన మను తులషీరామ్ రాజ్‌పుత్ కూడా ఉంది.
ఈ తొక్కిసలాటలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించంతో ఆమె మరణించింది. ఈ కార్యక్రమ నిర్వాహకులపై, ఆడిటోరియం హాల్ మేనేజర్ పై కేసు నమోదు చేయాలని శివసేన మహిళా వింగ్ డిమాండ్ చేసింది.