స్టాలిన్ ప్రమాణస్వీకారంలో ప్రశాంత్ కిషోర్ స్పెషల్ అట్రాక్షన్.. గవర్నర్ తో ముచ్చట్లు.. ఆలింగనాలు..

By AN Telugu  |  First Published May 8, 2021, 9:45 AM IST

డీఎంకే ఎన్నికల సలహాదారు ‘ఐ ప్యాక్‌’ సంస్థ ప్రతినిధి ప్రశాంత్ కిషోర్ శుక్రవారం జరిగిన నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. మంత్రులను గవర్నర్ కు పరిచయం చేసిన స్టాలిన్‌ తర్వాత ప్రశాంత్ కిషోర్ ను ప్రత్యేకంగా పరిచయం చేశారు.


డీఎంకే ఎన్నికల సలహాదారు ‘ఐ ప్యాక్‌’ సంస్థ ప్రతినిధి ప్రశాంత్ కిషోర్ శుక్రవారం జరిగిన నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. మంత్రులను గవర్నర్ కు పరిచయం చేసిన స్టాలిన్‌ తర్వాత ప్రశాంత్ కిషోర్ ను ప్రత్యేకంగా పరిచయం చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ తో ఆయన సరదాగా మాట్లాడుతూ అభినందించడం విశేషం. దీంతో అందరి చూపు వారి వైపు మళ్ళింది. కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి కుమారుడు దురై దయానిధి స్టాలిన్ కుమారుడు ఉదయనిధిని  ప్రత్యేకంగా అభినందించారు. 

Latest Videos

ఈ సందర్భంగా వారిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కాగా, తమిళనాడు సీఎంగా ఎంకె స్టాలిన్ శుక్రవారం నాడు ప్రమాణం చేశారు. గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్  స్టాలిన్ తో  ప్రమాణం చేయించారు. స్టాలిన్ తో పాటు మరో 34 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కరుణానిధి మంత్రివర్గంలో  పనిచేసిన వారికి స్టాలిన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. 

ఇవాళ ఉదయం రాజ్‌భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్ తో పాటు మరో 33 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కరుణానిది మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిన దురైమురుగన్ లాంటి సీనియర్లతో పాటు  12 మంది కొత్తవారికి కూడ స్టాలిన్ తన మంత్రివర్గంలో  చోటు కల్పించారు. 

పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్, అఖిలభారత సేవలు, జిల్లా రెవిన్యూ అధికారులు, ప్రత్యేక కార్యక్రమాల అమలు, వికలాంగుల సంక్షేమంతో హోం శాఖలు స్టాలిన్ తన వద్ద ఉంచుకొన్నారు. 2006-11 వరకు డిఎంకె పాలనలో  ప్రజా పనుల వంటి బాధ్యతలు స్వీకరించిన దురైమురుగన్ కు ఈ దఫా నీటిపారుదల, గనుల వంటి శాఖలను కేటాయించారు. చెన్నై మాజీ మేయర్ సుబ్రమణియన్ పికె శేఖర్ బాబు తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 

click me!