కారులో ఊపిరాడక... నలుగురు చిన్నారులు మృతి

Published : May 08, 2021, 09:37 AM ISTUpdated : May 08, 2021, 09:40 AM IST
కారులో ఊపిరాడక... నలుగురు చిన్నారులు మృతి

సారాంశం

 ఆ కారులోని ఐదుగురు చిన్నారులు ఎక్కారు. చిన్నారులు కారు ఎక్కడాన్ని అనిల్ గుర్తించలేదు. ఈ క్రమంలో కారు లోపలి నుంచి లాక్ అయిపోయింది.  

కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆడుకుంటూ కారులో చిన్నారులు చిక్కుకున్నారు. కారు లాక్ అయిపోవడంతో.. వారు అందులోనే ఉండిపోయారు. ఈ క్రమంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చాందినగర్ ఏరియాలోని సింగాలి టాగా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన అనిల్ త్యాగి అనే వ్యక్తి బయట కారు  పార్క్ చేశాడు. ఆ కారులోని ఐదుగురు చిన్నారులు ఎక్కారు. చిన్నారులు కారు ఎక్కడాన్ని అనిల్ గుర్తించలేదు. ఈ క్రమంలో కారు లోపలి నుంచి లాక్ అయిపోయింది.

కారులో చిక్కుకున్న చిన్నారులు నియాతి(8), వందన(4), అక్షయ్(4), కృష్ణ(7), శివాన్ష్(8)లుగా గుర్తించారు. వారిలో శివాన్ష్ మినహా.. అందరూ ప్రాణాలు కోల్పోయారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న శివాన్ష్ ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

కాగా.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !