లిఫ్ట్‌లో వికృత చేష్టలు: విద్యార్థినికి జననాంగం చూపిన కళాశాల కార్మికుడు

By sivanagaprasad kodatiFirst Published Nov 23, 2018, 12:42 PM IST
Highlights

తమిళనాడులోని ప్రముఖ విద్యాసంస్థ..ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల పట్ల వర్సిటీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొంటూ గురువారం రాత్రి విద్యార్ధులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. 

తమిళనాడులోని ప్రముఖ విద్యాసంస్థ..ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల పట్ల వర్సిటీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొంటూ గురువారం రాత్రి విద్యార్ధులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.

వివరాల్లోకి వెళితే... వర్సిటీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గురువారం మధ్యాహ్నం హాస్టల్ లిఫ్ట్‌లో వెళుతుండగా.. అదే లిఫ్ట్‌లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు తన జననాంగం చూపుతూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

విద్యార్థిని 4వ అంతస్తులో దిగాలి.. అతను 6వ అంతస్తుకు వెళ్లాలి.. అయితే ఆమెను అడ్డగించిన అతను 8వ అంతస్తు వరకు తీసుకెళ్లాడు. దీంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థిని గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు.

దీనిపై ఆమె హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేయగా.. మంచి బట్టలు వేసుకుని ఉంటే ఇలాంటి ఇబ్బందులు రావని చెప్పాడు.. దానితో పాటు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించేందుకు మూడు గంటలు జాప్యం చేశారని విద్యార్థులు మండిపడ్డారు.

అలాగే బాధితురాలిని మౌనంగా ఉండాల్సిందిగా ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థి లోకం భగ్గుమంది... అడ్మినిస్ట్రేషన్ భవంతి వద్ద ఆందోళనకు దిగారు.

తమ వస్త్రధారణను తప్పబడుతూ, అసభ్యంగా మాట్లాడుతున్నారని..అలాగే పురుష కార్మికులు విద్యార్థినుల వసతి గృహాల్లో పనిచేస్తూనే.. కిటీకీలు, తలుపు రంధ్రాల లోంచి అసభ్యంగా తొంగి చూస్తున్నారని.. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని విద్యార్థులు మండిపడ్డారు. దీనిపై ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సందీప్ సంచేటి మాట్లాడుతూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తమ విచారణలో 38 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు కొత్తగా చేరాడని.. అతనికి లిఫ్ట్ ఎలా ఎక్కాలో తెలియక అయోమయానికి గురయ్యాడని... ఈ ఘటన, విద్యార్థుల ఆందోళన అన్ని శుక్రవారం జరిగే పరీక్షను రద్దు చేయించడానికి జరిగిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆరోపణలపై మండిపడ్డ విద్యార్థులు.. కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు పోలీసులు కొత్త కథ అల్లుతున్నారని ఫైర్ అయ్యారు. 

click me!