భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడి.. 14 మంది అరెస్టు..

Published : Nov 17, 2022, 04:36 PM IST
భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడి.. 14 మంది అరెస్టు..

సారాంశం

పొరపాటున శ్రీలంక జాలాల్లోకి ప్రవేశించి చేపలు పడుతున్న భారతీయ మత్స్యకారులపై ఆ దేశ నేవి దాడి చేసింది. ఈ దాడిలో ఓ మత్య్సకారుడికి కంటికి గాయం అయ్యింది. 14 మందిని అరెస్టు చేసింది. 

భారతదేశానికి చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడి చేసింది. ఈ ఘటనలో ఓ మత్స్యకారుడికి కంటికి తీవ్రగాయాలు అయ్యాయి. సముద్ర సరిహద్దులను ఉల్లంఘించినందుకు ఆ దేశ నేవీ ఈ చర్యకు ఉపక్రమించింది. దాడి చేసిన అనంతరం తమిళనాడుకు చెందిన 14 మంది మత్స్యకారులను అరెస్టు చేసింది. 

కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీకి అస్వస్థత.. ఒక్క సారిగా క్షీణించిన ఆరోగ్యం

గాయపడిన మత్స్యకారుడిని రామేశ్వరానికి చెందిన జాన్సన్‌గా గుర్తించామని అధికారులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి శ్రీలంక నావికాదళ సిబ్బంది అతడిపై దాడి చేయడంతో కంటికి గాయమైందని చెప్పారు. ఈ మత్స్యకారులంతా నాగపట్నం జిల్లాకు చెందిన వారని తెలిపారు. వీరు చేపల వేటకు వెళ్లిన పడవను కూడా శ్రీలంక నేవీ సీజ్ చేసింది.

కాగా.. ఘటనకు సంబంధించి భారత్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా ఇంకా తెరపైకి రాలేదు. అయితే గతంలో కూడా సరిహద్దు ఉల్లంఘన విషయంలో శ్రీలంక నేవీ ఇలాంటి చర్యలే తీసుకుంది. అక్టోబర్ 17వ తేదీన అక్ర‌మంగా త‌మ స‌ముద్ర జ‌లాల్లో చేప‌లు ప‌డుతున్నారని ఆరోపిస్తూ ఏడుగురు భార‌తీయ జాలర్లను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది.  వారి పడవను స్వాధీనం చేసుకుంది. కచ్చాతీవు, నెడుంతీవు మధ్య చేపలు పట్టడానికి వెళుతుండగా, శ్రీలంక నావికాదళం గస్తీ కాస్తున్న మత్స్యకారులను చేపలు పట్టకుండా ఆపి, వారి చేపలను లాక్కుంది. నెడుండివు సమీపంలో చేపలు పడుతున్న మైఖేల్ రాజ్ కు చెందిన పడవతో పాటు అందులో ఉన్న ఏడుగురు జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మత్స్యకారులను దర్యాప్తు కోసం కరైనగర్ నావల్ క్యాంప్ కు తరలించారు. దర్యాప్తు అనంతరం వాటిని జాఫ్నా మత్స్యశాఖ అధికారులకు అప్పగించారు. 

కర్ణాటక సీఎం ఎన్నికల అవినీతికి పాల్పడ్డాడు.. అరెస్టు చేయండి - కాంగ్రెస్

గతేడాది డిసెంబర్ నెలలో సమ‌ద్రంలో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లిన జాల‌ర్లు పొర‌పాటున శ్రీలంక జ‌లాల్లోకి ప్ర‌వేశించ‌డంతో వారిని కూడా నేవి అధికారులు అరెస్టు చేశారు. ‘‘డిసెంబర్ 18, 2021 రాత్రి శ్రీ‌లంక జాలాల్లో చేప‌లు వేటాడుతున్న 43 మంది భారతీయ జాల‌ర్ల‌ను జాఫ్నాలోని డెల్ఫ్ట్ ద్వీప ఆగ్నేయ సముద్రంలో ప్రాంతంలో స్పెష‌ల్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి అరెస్టు చేశాం. అలాగే 6 భారతీయ ఫిషింగ్ ట్రాలర్లను కూడా స్వాధీనం చేకున్నాం’’ అని శ్రీలంక ఆ సమయంలో అధికారికంగా ప్రకటించింది. నార్తర్న్ నేవల్ కమాండ్‌కు అనుబంధంగా ఉన్న 04వ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఫ్లోటిల్లా (4 FAF) ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ల‌తో ఈ అరెస్టులు చేశాన‌మ‌ని చెప్పారు. పూర్తిగా కోవిడ్ -19 ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఈ ఆపరేషన్ నిర్వహించామ‌ని తెలిపారు.

నేనేమైనా పారిపోతానా.. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా ట్రీట్ చేస్తారా : ఈడీపై హేమంత్ సోరెన్ ఫైర్ 

రెండు దేశాలకు చెందిన జాల‌ర్లు అనుకోకుండా ఒకరి జలాల్లోకి వ‌స్తున్నారు. ఈ కార‌ణంగా త‌రుచూ రెండు దేశాల‌కు చెందిన మ‌త్స్య‌కారులు అరెస్టుల‌కు గురవుతున్నారు. ఈ ఘటనలు మత్స్యకారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం