న్యూటన్ ఫోర్త్ లా ప్రకారమే కరోనా వ్యాప్తి.. ఓ స్టూడెంట్ హాస్యాస్పద విశ్లేషణ..

By team telugu  |  First Published Jan 9, 2022, 12:45 PM IST

రెండేళ్ల నంచి కరోనా కేసులు పెరగడం, తగ్గడం వంటి పరిణామాలన్నీ చూసిన ఓ స్టూడెంట్ విసుగు చెంది ఓ పన్నీ విశ్లేషణ చేశాడు. న్యూటన్ ఫోర్త్ లా ప్రకారమే కేసులు పెరుగుతున్నాయని చెప్పాడు. సోషల్ మీడియాలో ఇప్పుడది వైరల్ గా మారింది. 


క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం అన్ని రాష్ట్రాలు క‌ఠిన నిబంధన‌లు అమ‌లు చేస్తున్నాయి. నైట్ క‌ర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్‌లు విధిస్తున్నాయి. వీటితో పాటు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. మాస్క్ లు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, అలాగే కోవిడ్ నిబంధన‌లు ఎవ‌రూ ఉల్లంఘించ‌కూడ‌దంటూ సూచ‌న‌లు చేస్తున్నాయి. దీంతో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. 

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ఇంత వ‌ర‌కు 18 ఏళ్ల పైబ‌డిన వారికి మాత్ర‌మే క‌రోనా వ్యాక్సిన్ అందించారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వ కొత్త నిర్ణ‌యంతో 15-18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ ప్ర‌క్రియ జ‌న‌వ‌రి 3 నుంచి ప్రారంభ‌మైంది. అలాగే క‌రోనా వారియ‌ర్స్, 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు రేప‌టి నుంచి (జ‌న‌వ‌రి 10) ముంద‌స్తు డోసు వ్యాక్సిన్ అందించ‌నున్నారు. వీరికి కరోనా రిస్క్ అధికంగా ఉండే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఈ అద‌న‌పు డోసు వేస్తున్నారు. 

Latest Videos

undefined

2019 సంవ‌త్స‌రంలో క‌రోనా మ‌హమ్మారి వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి అంద‌రినీ ఇబ్బంది పెడుతోంది. ప్ర‌పంచ దేశాల్లో వేవ్‌లు వ‌స్తూ పోతూ ఉన్నాయి. ఇండియాలో కూడా ఇప్పుడు మూడో సారి కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎన్నో విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. వివిధ యూనివ‌ర్సిటీలు, సంస్జలు, శాస్త్ర‌వేత్త‌లు, నిపుణులు క‌రోనా పెరుగుద‌ల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపి విశ్లేష‌ణ‌లు వెళ్ల‌డిస్తున్నారు. శ‌నివారం కూడా ఐఐటీ క‌న్పూర్, ఐఐటీ మ‌ద్రాస్ యూనివ‌ర్సిటీలు త‌మ ప‌రిశోధ‌న ఫలితాలు వెల్ల‌డిస్తున్నాయి. విశ్లేష‌ణ‌ సారాంశాన్ని చెబుతున్నాయి. అయితే ఈ క్ర‌మంలో క‌రోనా కేసుల‌పై ఓ స్టూడెంట్ కొత్త ర‌కం విశ్లేష‌ణ చేశాడు. ఈ విశ్లేష‌ణ చాలా హాస్యాస్ప‌దంగా సాగింది. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

ఓ స్టూడెంట్ న్యూట‌న్ ఫోర్త్ లాను ఆధారంగా చేసుకొని ఈ విశ్లేష‌ణ చేశాడు. దీని ప్ర‌కారం క‌రోనా కేసులు పెరుగుతున్న‌ప్పుడు, ప‌రిశోధ‌న‌లు త‌గ్గుతున్నాయ‌ని, ప‌రిశోధ‌న‌లు పెరుగుతున్న‌ప్పుడు క‌రోనా త‌గ్గుతోంద‌ని చెప్పాడు. ఈ రెండు అంశాలు అనులోమానుపాతంలో ఉంటాయ‌ని ఆ స్టూడెంట్ వివ‌రించాడు. దీనిని స‌మీక‌ర‌ణం రూపంలో రాసి చూపించాడు. ఆ స్టూడెంట్ చేసిన విశ్లేష‌ణ చాలా ఫ‌న్నీగా సాగింది. దీనిని మొత్తం ఆ పిల్లాడు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి జ‌రిగిన ప‌రిణామాల‌ను చూసి విసుగు పుట్టిన స్టూడెంట్ ఈ విధంగా పోస్ట్ చేశాడు. 2019లో క‌రోనా వైర‌స్ ను గుర్తించిన 2020 మార్చి నుంచి లాక్ డౌన్ విధించారు. కొంత కాలం త‌రువాత క‌రోనా కేసులు త‌గ్గిపోవ‌డంతో మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో స్కూళ్లు, కాలేజీలు అన్నీ ఓపెన్ అయ్యాయి. మ‌ళ్లీ క‌రోనా రెండో వేవ్ వ‌చ్చింది. కొంత కాలం త‌రువాత కేసులు త‌గ్గాయి. మ‌ళ్లీ ఇప్పుడు కేసులు పెరిగి లాక్ డౌన్ విధించే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆ స్టూడెంట్ ఇలా ఫ‌న్నీగా విశ్లేష‌ణ చేశాడు. 

click me!