Uttar Pradesh Assembly Election2022: సమాజ్‌వాదీ పార్టీ తరపున కేసీఆర్ ప్రచారం చేసే ఛాన్స్

Published : Jan 09, 2022, 11:23 AM ISTUpdated : Jan 09, 2022, 01:46 PM IST
Uttar Pradesh Assembly Election2022: సమాజ్‌వాదీ పార్టీ తరపున కేసీఆర్ ప్రచారం చేసే ఛాన్స్

సారాంశం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలుగు మాట్లాడే ఓటర్లున్న ప్రాంతాల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున కేసీఆర్ ప్రచారం చేయనున్నారు.


న్యూఢిల్లీ: Uttarpradesh Assembly Election 2022  ఎన్నికల్లో సమాజ్‌వారీ పార్టీ తరపున ప్రచారం చేయాలని తెలంగాణ సీఎం kcr భావిస్తున్నారు. ఈ విషయమై  పార్టీకి చెందిన కొందరు సీనియర్లతో కేసీఆర్ చర్చించారని సమాచారం.  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో స్థిరపడిన దక్షిణాది ఓటర్లతో పాటు తెలుగు మాట్లాడే ప్రజలను సమాజ్‌వాదీ పార్టీకి మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ ప్రచారం చేసే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల బహిరంగ సభలకు ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఓటర్లకు లేఖలు రాయాలని కూడా trs భావిస్తోంది.

టీఆర్ఎస్ కి Samajwadi party తో మంచి సంబంధాలున్నాయి. bjp కి వ్యతిరేకంగా సాగే కార్యక్రమాల్లో సమాజ్‌వాదీ పార్టీ  కూడా కీలక భూమిక పోషిస్తోంది. 2018 మే లో Ndaకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించేందుక కేసీఆర్‌ తో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ Akhilesh Yadav కేసీఆర్ తో హైద్రాబాద్ ప్రగతి భవన్ లో చర్చించారు.

గత ఏడాది నవంబర్ లో జరిగిన huzurabad bypoll ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి  ఈటల రాజేందర్ విజయం సాధించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. Paddy  ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి రెండు పార్టీల మధ్య పరస్పరం సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకొన్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా రెండు పార్టీల మధ్య కూడా చిచ్చు రేగింది.

ఈ తరుణంలో బీజేపీకి చెందిన అగ్రనేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.యూపీలో బీజేపీ విజయం సాధిస్తే తెలంగాణలో ఆ పార్టీ మరింత ఉధృతంగా కార్యకలాపాలను సాగించే అవకాశం ఉందని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. యూపీలో బీజేపీని గద్దె దింపేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు.  ఇందుకు గాను యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

దుబ్బాక,హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన సీట్లను గెలుచుకోవడంతో టీఆర్ఎస్ కు  తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్పుకొంటుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, చత్తీస్‌ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ తదితరులు కూడా  తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు.

ఉద్యోగుల బదిలీలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టినందుకు అరెస్టైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు మద్దతు తెలిపేందుకు గత నాలుగు రోజులుగా హైద్రాబాద్‌లో పర్యటించారు.  2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఆందోళనలు ఉధృతం చేయాలని కూడా బీజేపీ  రాష్ట్ర శాఖకు పిలుపునిచ్చింది..

యూపీ, పంజాబ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సీఎం కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేసేందుకు టీఆర్ఎస్ వైపు నుండి ఏం చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !