మహాగడ్భందన్ నాయకుడిగా నితీశ్ కుమార్ ఎన్నిక, రబ్రీదేవి నివాసంలో కీలక భేటీ

By Siva KodatiFirst Published Aug 9, 2022, 5:23 PM IST
Highlights

మహాగడ్భందన్ నాయకుడిగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. రాజ్‌భవన్‌కు భారీ ర్యాలీగా బయల్దేరారు జేడీయూ , ఆర్జేడీ నేతలు. అంతకుముందు మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో నితీశ్ కుమార్ , తేజస్వి యాదవ్‌తో చర్చలు జరిపారు

ఎన్డీయే నుంచి తప్పుకున్న జేడీయూ.. బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహాగడ్భందన్ నాయకుడిగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. రాజ్‌భవన్‌కు భారీ ర్యాలీగా బయల్దేరారు జేడీయూ , ఆర్జేడీ నేతలు. అంతకుముందు మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో నితీశ్ కుమార్ , తేజస్వి యాదవ్‌తో చర్చలు జరిపారు. కొత్త ప్రభుత్వంలో నితీశ్ కుమార్ సీఎంగా వ్యవహరిస్తారని.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. 

అంతకుముందు బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందించారు.  రాజ్ భవన్ కు చేరుకున్న సీఎం నితీష్ కుమార్  గవర్నర్ పాగు చౌహాన్ కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. జేడీయూ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పార్లమెంటరీ పార్టీ నేత ఉపేంద్ర కుష్వాహా సీఎం నితీష్ కుమార్ ను అభినందించారు. కొత్త కూటమికి నాయకత్వం వహిస్తున్నందుకు  అభినందనలు తెలుపుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.నితీష్ జీ ముందుకు సాగండి, దేశం మీ కోసం వేది ఉందని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. గవర్నర్ తో భేటీ ముగిసిన తర్వాత  రాజ్ భవన్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించినట్టుగా నితీష్ కుమార్  మీడియాకు చెప్పారు.  

ALso Read:నితీష్ కుమార్ పాలిటిక్స్.. బిహార్ రాజకీయాల గురించి 10 ఆసక్తికర విషయాలు

ఇకపోతే.. బీహార్ లో అధికారం నుంచి బీజేపీ వైదొలింగ‌ద‌ని, ఇక కేంద్రం నుంచి ఆ పార్టీని తొల‌గిస్తామ‌ని ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ అన్నారు. నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అని అన్నారు. అదే త‌మ మొద‌టి ప్రాధాన్య‌త అని చెప్పారు.  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను లాలూ ప్రసాద్ నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. 

కాగా.. బీహార్ లో రాజ‌కీయ ప‌రిణామాలు ఒక్క సారిగా మారిపోయాయి. గ‌త రెండు మూడు రోజుల నుంచి కూట‌మిలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. బీహార్ లో జేడీ(యూ), బీజేపీ క‌లిసి ఎన్డీఏ కూట‌మిగా ఏర్ప‌డి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈ రెండు పార్టీల మ‌ధ్య విభేదాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం నితీష్ కుమార్ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో నితీష్ కుమార్ ఇక బీజేపీతో విడిపోవాల‌ని నిర్ణ‌యించారు. 

click me!