మహారాష్ట్రలో వెయ్యి మంది పోలీసులకు కరోనా

By telugu news teamFirst Published May 11, 2020, 12:37 PM IST
Highlights

మహారాష్ట్రలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 1007కు చేరింది. గత 24 గంటల్లో 221 మందికి కరోనా సోకింది. మొత్తం 106 మంది పోలీసు అధికారులకు, 901  మంది పోలీసులకు కరోనా సోకింది. 
 


దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ దేశంలో కేసులు పెరిగిపోతున్నాయి. కేవలం 24గంటల్లో మన దేశంలో 4వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. ఈ ప్రభావం మహారాష్ట్రలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది.

కాగా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు ఎంతగా శ్రమిస్తున్నారో.. పోలీసులు కూడా అంతే కష్టపడుతున్నారు. ప్రాణాలకు తెగించి లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా...అలాంటి పోలీసులు మహారాష్ట్రలో కరోనా వైరస్ దాటికి గురౌతున్నారు.

అక్కడ పోలీసులకు కూడా కరోనా సోకడం గమనార్హం. మహారాష్ట్రలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 1007కు చేరింది. గత 24 గంటల్లో 221 మందికి కరోనా సోకింది. మొత్తం 106 మంది పోలీసు అధికారులకు, 901  మంది పోలీసులకు కరోనా సోకింది. 

మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో  కొత్తగా 1278 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 53 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 832కు పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 22, 171కు చేరింది. ధారావిలో పరిస్థితి అధికారులను కలవరపెడుతోంది. 

మహారాష్ట్రకు కేంద్ర బృందాలు అన్ని విధాలా సహకారం అందిస్తున్నాయి. అయినా కేసులు అదుపులోకి రావడం లేదు. మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అటు భారత్‌లో ఇప్పటివరకూ 67, 152 కరోనా కేసులు నమోదయ్యాయి. 2206 మంది చనిపోయారు. 20916 కోలుకున్నారు.

click me!