
ఢిల్లీ : ఎన్ సీడిఆర్సీ దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రూ.1.5 కోట్ల భారీ జరిమానా విధించింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ మేరకు ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించడానికి కారణం ‘వీర్య మార్పిడి’. కృత్రిమ గర్వధారణ కోసం ఓ మహిళ ఆసుపత్రికి వచ్చింది. అయితే ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో ఆమె భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యాన్ని ఆసుపత్రి వర్గాలు తప్పుగా ఎక్కించారు.
ఏఆర్టీ విధానంలో వారు సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు. దీనికోసమే ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అవడంతో 2009 జూన్ లో ఆ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. పుట్టిన తర్వాత శిశువులకు డిఎన్ఏ పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో వారి తండ్రి ఆ మహిళ భర్త కాదని తేలింది. మరొకరి వీర్యంతో వారు పుట్టినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
సిగరెట్ తాగాడని టెన్త్ క్లాస్ విద్యార్థిపై టీచర్ల దాడి.. విచక్షణా రహితంగా బెల్టుతో కొట్టడంతో మృతి...
ఆస్పత్రి చేసిన పొరపాటుకు తమకు న్యాయం చేయాలంటూ కోరారు. ఆస్పత్రి కలిగించిన మానసిక వేదనకు రూ.2కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్సిడిఆర్సిని ఆశ్రయించారు దంపతులు. ఈ కేసు మీద ఎన్సిడిఆర్సీ సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ విచారణ అనంతరం దంపతులకు అనుకూలంగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
వారు కోరినట్లుగా దంపతులకు రూ.1.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ ప్రైవేట్ ఆస్పత్రికి కమిషన్ ఆదేశించింది, అంతేకాదు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డిఎన్ఏ ప్రొఫైల్ ను తయారు చేసి ఇచ్చేలా.. నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.