చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. అధికారులను అప్రమత్తం చేసిన ఉత్తరాఖండ్ సీఎం..

Published : Jun 27, 2023, 05:59 AM IST
చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. అధికారులను అప్రమత్తం చేసిన ఉత్తరాఖండ్ సీఎం..

సారాంశం

Char Dham Yatra: ప్రతికూల వాతావరణం కారణంగా చార్ ధామ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం చార్ ధామ్ యాత్రలో వర్షం, మంచు కురుస్తున్న దృష్ట్యా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలు జారీ చేశారు

Char Dham Yatra: కేదార్ నాథ్, బద్రీనాథ్ వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం నెలకొనడంతో ముందుజాగ్రత్త చర్యగా చార్ ధామ్ యాత్రను నిలిపివేశారు. సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చార్ధామ్ యాత్రలో వర్షం, మంచు కురుస్తున్న దృష్ట్యా ఆదేశాలు జారీ చేశారు . మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మార్గంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం చార్ ధామ్ యాత్రను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత వారం రోజులుగా మంచు, వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడిపోయాయి.దీని కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించిన తర్వాత తమ యాత్రను కొనసాగించవలసిందిగా చార్ ధామ్ యాత్రకు వచ్చే ప్రయాణికులకు సీఎం పుష్కర్ సింగ్ ధామి  విజ్ఞప్తి చేశారు.
 
భారీ నుండి అతి భారీ వర్ష సూచన

రానున్న 24 గంటల్లో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ , టెహ్రీ గర్వాల్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సోమవారం అంచనా వేసింది. వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం.. రాబోయే 24 గంటల్లో డెహ్రాడూన్, టెహ్రీ గర్వాల్ జిల్లాల్లో ఉరుములు , మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లోని కొన్ని జిల్లాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి.  

కంట్రోల్ రూంను పరిశీలించిన సీఎం 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం సచివాలయంలోని స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా సందర్శించి రాష్ట్రంలో భారీ వర్షాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి, వర్షాల పరిస్థితి, నీటి ఎద్దడి, వర్షాల వల్ల సంభవించిన నష్టం గురించి సీఎం ధామి డిజాస్టర్ కంట్రోల్ రూం నుంచి సమాచారం తెలుసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్