ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్.. తీవ్రమవుతున్న సమస్య.. కొత్త అధ్యయనాల ఏమంటున్నాయంటే..

By SumaBala BukkaFirst Published Nov 16, 2022, 7:55 AM IST
Highlights

పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గుతోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారత్ సహా అనేక దేశాల్లో ఇదే పరిస్థితి అని అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో చేసిన అధ్యయనాల మేరకు గత కొన్నేళ్లుగా స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గుతున్నట్లు  అంతర్జాతీయ పరిశోధకుల బృందం తేల్చింది. ఈ దేశాల్లో భారత్ కూడా ఉన్నట్లు తెలిపారు.స్పెర్మ్ కౌంట్ లో క్షీణతను మానవ పునరుత్పాదక లోపంగానే కాకుండా.. పురుషుల ఆరోగ్య కోణంలోనూ చూడాల్సి ఉంటుందని చెప్పారు. వీర్యపుష్టి తగ్గితే దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్, జీవితకాలంలో తగ్గుదల వంటి ప్రమాదాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్షీణతను ఆధునిక పర్యావరణ పరిస్థితులు, జీవనశైలుల పరంగా ప్రపంచ సంక్షోభంగా.. పరిశోధకులు అభివర్ణించారు. 

మానవ జాతులు మనుగడపై దీని విస్తృత ప్రభావం ఉంటుందని తెలిపారు. 53 దేశాలనుంచి సేకరించిన ఈ అధ్యయనం వివరాలు ‘హ్యూమన్ రిప్రొడక్షన్ అప్ డేట్’ జర్నల్ లో మంగళవారం ప్రచురితమయ్యాయి. ‘భారతదేశంలోనూ బలమైన, స్థిరమైన క్షీణత ఉందని మా నిశ్చితాభిప్రాయం.. ఇదే పరిస్థితి మిగతా దేశాల్లోనూ  ఉంది’ అని ఇజ్రాయిల్లోని జెరూసలేంకు చెందిన హిబ్రూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హగాయ్ లెవిన్ తెలిపారు. ‘మొత్తానికి గత 46 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం స్పెర్మ్ కౌంట్ తగ్గింది.  ఇటీవలి సంవత్సరాల్లో ఈ తగ్గుదల వేగం మరింత పెరిగింది.’ అని ఆయన వివరించారు. 

పామును ముద్దాడబోతే... కసిదీరా పెదవులపై కాటేసింది.. చికిత్స తీసుకుంటూ....

క్షీణతకు కారణాలు ఏమిటన్న దానిపై మాత్రం ఈ అధ్యయనం దృష్టి పెట్టలేదు. ‘జీవనశైలి ఎంపికలు పర్యావరణంలో రసాయనాల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి’ అని లెవిన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ప్రపంచ దేశాలు ఈ సమస్యపై తక్షణం స్పందించాలని తాము కోరుతున్నట్లు ఆయన తెలిపారు. 

click me!