రాహుల్ కొడుకులాంటివాడు, అదేం ప్రవర్తన : స్పీకర్ చురకలు

First Published Jul 20, 2018, 5:05 PM IST
Highlights

ఇవాళ అవిశ్వాస తీర్మాన ప్రసంగం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన పనిని స్పీకర్ సుమిత్రా మహజన్ తప్పుబట్టారు. ఆయన అలా చేసి ఉండాల్సింది కాదని సూచించారు. ఓ దేశ ప్రధానితో నిండు సభలో ఇలా ప్రవర్తించడం సంస్కారం అనిపించుకోదని సుమిత్రా మహజన్ అన్నారు. రాహుల్ వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందని ఆమె అన్నారు.
 
సభను మాత్రమే తాను నడిపిస్తున్నానని, సభా గౌరవాన్ని కాపాడాల్సిన భాద్యత సభ్యలపైనే ఉంటుందని సుమిత్రా మహజన్ సూచించారు. సభలో ప్రధాని నరేంద్ర మెదీని రాహుల్ గాంధీ కౌగిలించుకోవడం ఆ తర్వాత తన స్థానంలోకి వెళ్లి కూర్చుని ప్ఱధాని వంక చూస్తూ కన్న కొట్టడం అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. సభలో లేని కొత్త సాంప్రదాయాలను రాహుల్ నేర్పిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ఈ సంఘటనపై కాంగ్రెస్  పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే కు ఆమె చురుకలు అంటించారు. తమ సభ్యులు మర్యాదగా, హుందాగా ఉండేలా చూడాలని స్పీకర్ అతడికి సూచించారు. రాహుల్ నా కొడుకు లాంటి వాడే కాబట్టి అతడు ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నట్లు సుమిత్రా మహజన్ తెలిపారు. రాహుల్ కు ఇంకా చాలా రాజకీయ జీవితం ఉందని, అందువల్ల మర్యాదగా ఉండటం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ ప్రధానితో రాహుల్ అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని స్పీకర్ అన్నారు.
 
click me!