నా మీద సానుభూతి చూపించడండి.. బాబ్రీ కూల్చివేత సమయంలో.. మాజీ ప్రధాని పీవీ..!

By telugu news teamFirst Published Nov 15, 2021, 11:33 AM IST
Highlights

సల్మాన్ ఖుర్దీష్ ఇటీవల పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఆ పుస్తకంలో భాగంగా.. ఆ నాటి విషయాలను అందులో పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఆదివారం జరిగిందని ఆయన అన్నారు.  

డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదుని కూల్చి వేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే.. ఆ మరసటి రోజు  ఉదయం అప్పటి కేంద్రమంత్రి మండలి సమావేశమైంది. అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు అధ్యక్షతన ఆ సమావేశం జరిగింది. అనూహ్యంగా జరిగిన ఆ ఘటనపై మంత్రులంతా ప్రధానికి అభిప్రాయాలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. అప్పుడే పీవీ.. ‘‘దయచేసి మీరు నాపై సానుభూతి ప్రదర్శించండి’’ అన్నారు. 

Also Read: కూసిన ఎన్నికల కోడ్ ... వర్ష బీభత్సం

ఈ విషయాన్ని నాటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ తన తాజా పుస్తకం ‘సన్‌రైజ్‌ ఓవర్‌ అయోధ్య’లో వెల్లడించారు. ‘‘ఆ క్షణం  మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది’’ అని ఖుర్షీద్‌ గుర్తుచేసుకున్నారు.

సల్మాన్ ఖుర్దీష్ ఇటీవల పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఆ పుస్తకంలో భాగంగా.. ఆ నాటి విషయాలను అందులో పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఆదివారం జరిగిందని ఆయన అన్నారు.  డిసెంబర్ 7 ఉదయం, పార్లమెంట్ హౌస్‌లోని రద్దీగా ఉండే గ్రౌండ్ ఫ్లోర్ రూమ్‌లో మంత్రి మండలి సమావేశమైందని ఆయన చెప్పారు. ఆ సమయంలో.. అందరు మంత్రులు.. ఆ ఘటనపై ప్రధానికి తమ అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ సమయంలో.. పీవీ.. తనపై దయచేసిన సానుభూతి చూపించాలని అన్నారట. ఈ విషయం తనకు ఇప్పటికీ గుర్తు ఉందని ఖుర్దీష్ పేర్కొన్నారు.

Also Read: హోటలో ముందు ఆపిన కారు మాయం.. కారులో ఉన్న భార్య ఏమైందంటే...

ఆ తర్వాత మళ్లీ ఈ అంశం గురించి మాట్లాడటానికి మళ్లీ అవకాశం రాలేదని ఆయన ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ తర్వాత కళ్యాణ్ సింగ్  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 6 న బర్తరఫ్ చేశారు. ఒక వారం తర్వాత, క్యాబినెట్ సలహా మేరకు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ , మధ్యప్రదేశ్‌లలో బిజెపి ప్రభుత్వాలను రాష్ట్రపతి రద్దు చేశారని ఆయన చెప్పారు.

డిసెంబరు 6వ తేదీ రాత్రి, తాను , మరికొందరు యువ మంత్రులు "రాజేష్ పైలట్ నివాసం వద్ద స్టాక్ తీసుకోవడానికి సమావేశమయ్యారు, ఆపై సికె జాఫర్ షరీఫ్‌తో కలిసి ముందుకు సాగారు - తద్వారా ప్రభుత్వంలో రెండు ధైర్యమైన గొంతులు లేచాయి" అని ఖుర్షీద్ రాశారు. 
 

click me!