హోటలో ముందు ఆపిన కారు మాయం.. కారులో ఉన్న భార్య ఏమైందంటే...

By AN TeluguFirst Published Nov 15, 2021, 10:45 AM IST
Highlights

హోటల్ బయట కారును ఆపి.. wifeను లోపలి ఉండమని చెప్పి అక్కడ గదులు ఖాళీగా ఉన్నాయా? లేదా? కనుక్కొని వస్తానని వెళ్ళాడు. ఆ వ్యక్తి భార్య కారులో ఒంటరిగా ఉంది.. 

ఉత్తర భారతదేశంలో నేరాల సంఖ్య ఇటీవల భారీగా పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రంలోనూ దొంగతనాలు కేసులు  భారీగా నమోదవుతున్నాయి. హర్యానా రాష్ట్రంలోని  రోహ్తక్ నగరంలో ఇటీవలే ఒక కారులో భార్యాభర్తలిద్దరూ ప్రయాణిస్తుండగా వారికి అనుకోని సంఘటన ఎదురైంది.

వారు రాజస్థాన్ లోని తమ ఇంటికి వెళుతుండగా మార్గంలో భార్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ భర్త ఆ రాత్రికి Rohtak నగరంలో ఏదైనా హోటల్లో బస చేయాలనుకున్నారు. అలా దారిలో Rohtakలోని సిటీ పార్క్ దగ్గరున్న ఒక హోటల్ కు తన భార్యతో సహా కారులో ఆ భర్త వెళ్లాడు.

హోటల్ బయట కారును ఆపి.. wifeను లోపలి ఉండమని చెప్పి అక్కడ గదులు ఖాళీగా ఉన్నాయా? లేదా? కనుక్కొని వస్తానని వెళ్ళాడు. ఆ వ్యక్తి భార్య కారులో ఒంటరిగా ఉండగా.. అప్పుడే అక్కడికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నేరుగా కారులో కూర్చున్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి.. భయపడిపోయింది.  ఆమెను ఆ దుండగుడు.. ‘చప్పుడు చేయకుండా కారులోంచి దిగిపో.. లేకపోతే చంపేస్తా’నని బెదిరించాడు. అప్పటికే భయంతో చెమటలు పట్టిన ఆమె త్వరగా కారులో నుంచి దిగి పోయింది.  దీంతో ఆ దుండగుడు కారు తీసుకుని పారిపోయాడు.

బర్రె పాలు ఇవ్వడం లేదని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన రైతు.. ఆయన ఫిర్యాదు వింటే షాక్

ఆ తర్వాత ఆమె భర్త అక్కడికి రాగా car కనిపించలేదు. భార్య భయంతో వణుకుతూ కనిపించింది. ఏం జరిగిందని ఆమెను అడిగాడు. కారు తీసుకుని thief పారిపోయాడు అని ఆమె తెలిపింది. ఆ భార్యభర్తలిద్దరు ఈ ఘటన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కారు దొంగతనం కేసు నమోదు చేసి... దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. 

బర్రెపాలివ్వడం లేదంటూ...
Madhya Pradeshలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన బర్రె Milk ఇవ్వడం లేదని ఓ Farmer ఏకంగా Police stationకే వెళ్లాడు. ఒక్కడే కాదు.. Buffaloనూ వెంట తీసుకెళ్లాడు. పోలీసుల ముందు బోరుమన్నాడు. కొద్ది రోజుల క్రితం వరకు తన బర్రె బ్రహ్మాండంగా పాలు ఇచ్చేదని, కానీ, కొన్ని రోజుల నుంచి పొదుగు దగ్గరకు కూడా తనను వెళ్లనివ్వడం లేదని చెప్పాడు. 

తన బర్రె వింత ప్రవర్తనకు కారణంగా చేతబడి అని సందేహిస్తున్నట్టు వివరించాడు. పోలీసులు వారించే ప్రయత్నం చేసినా ఆయన అంగీకరించలేదు. తన బర్రెకు చేతబడి చేశారనే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఏం చర్యలు తీసుకోవాలా? అని పోలీసులు ఒక దశలో డైలామాలో పడిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్ విచిత్రమైన రాష్ట్రంగా ఉన్నదని, బర్రె పాలు ఇవ్వడం లేదని ఓ రైతు పోలీసు స్టేషన్‌కు వెళ్లాడని ఓ వ్యక్తి పోస్టు చేశాడు. ఆ గ్రామస్తుడిని బాబు లాల్ జాతవ్‌గా గుర్తించారు. 

click me!