UP Assembly Election 2022: ఇక నుంచి బీజేపీ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోం.. అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Published : Jan 15, 2022, 05:18 PM IST
UP Assembly Election 2022: ఇక నుంచి బీజేపీ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోం.. అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

సారాంశం

UP Assembly Election 2022:  యూపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న‌కొద్దీ ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య  మాటల తూటాలు పేలుతున్నాయి. అలాగే..బీజేపీలో వ‌ల‌స‌లు పెరుగుతున్న క్ర‌మంలో బీఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ కీలక వ్యాఖ్యలు చేశారుఇక‌పై నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను గానీ,  మంత్రులను గానీ పార్టీలోకి తీసుకునేది లేద‌ని అఖిలేష్ యాదవ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

UP Assembly Election 2022: త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌లు చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోన్నాయి. ఎన్నిక‌లు సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన నేత‌లు వ‌ల‌స బాట ప‌డ‌టంతో రాజకీయ పరిణామాలు కూడా శ‌ర‌వేగంగా మారుతున్నాయి. దీంతో చ‌లికాలం సైతం పొలిటిక‌ల్ హీటెక్కిస్తున్నాయి. 

 ఇటీవల బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ‌రుస‌గా వ‌ల‌స‌ల బాట పడుతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే  మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు సైతం బీజేపీని వీటి అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మ‌రికొంద‌రూ నేత‌లు కూడా పార్టీ ఫిరాయించే యోచ‌న‌లో ఉన్నారు.  

ఈ క్రమంలో బీఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక‌పై నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను గానీ,  మంత్రులను గానీ పార్టీలోకి తీసుకునేది లేద‌ని అఖిలేష్ యాదవ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.  ఇకపై బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను కానీ త‌న పార్టీలో చేర్చుకోనని చెప్పానని, వారు పార్టీలోకి వ‌స్తే.. తమ నేతలకు టిక్కెట్లు నిరాకరించాల్సి వ‌స్తుంద‌ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. 

అదే సమయంలో, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో పొత్తుకు సంబంధించి SP చీఫ్ అఖిలేష్ మాట్లాడుతూ, అతను (భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్) సమాజ్ వాదీ పార్టీతో ఏమి మాట్లాడినా, నేను అతనిని మరియు రాంపూర్ మణిహారన్ మరియు ఘజియాబాద్ ప్రజలు వారికి సీట్లు ఇచ్చారు. ఒకరితో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేమని చెప్పారు. కానీ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూటమిలో భాగం కావడానికి నిరాకరించారని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి అఖిలేష్ పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై సమాలోచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ ఎస్పీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోన్నారు.  

అంత‌కు ముందు .. ఉత్త‌ర ప్ర‌దేశ్ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన తర్వాత.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై  అఖిలేష్ యాదవ్ కామెంట్ చేశారు. అయోధ్య నుంచి కాకుండా గోరఖ్‌పూర్‌ నుంచి సీఎం యోగిని నిల‌బెట్టడంపై  అఖిలేష్ ఎద్దేవా చేశారు. బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యనాథ్ ను ఇంటికి పంపిందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఎన్నిక‌ల్లో ప్రజలు ఎలాగు ఇంటికి పంపుతారనే తెలిసే.. ఆయ‌న‌ను బీజేపీ ఇంటికి  పంపినందుకు సంతోషిస్తున్నానని అన్నారు,  ఆయ‌న ఇప్పుడు గోరఖ్‌పూర్‌లోనే ఉండాల్సి వస్తుందని, ఆయ‌న ఇప్ప‌డు ఎక్క‌డికి పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని  భావించి పార్టీ ఈ నిర్ణ‌యం తీసుకుందాని అన్నారు. 
 
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ, రెండో దశ ఎన్నికల్లో 105 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్‌ నుంచి, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ప్రయాగ్‌రాజ్‌ జిల్లా సిరతునుంచి బరిలోకి దించ‌నున్న‌ది. ఇదిలా ఉండగా, శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో 'వర్చువల్‌గా' నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన 2,000 నుంచి 2,500 మంది కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. దీంతో యూపీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. క‌రోనా నేప‌థ్యంలో అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించ‌డం. అలాగే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని తగు చర్యలు తీసుకుంటామని లక్నో డీఎం అభిషేక్ ప్రకాశ్ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!