సినిమా ఛాన్స్ పేరుతో బాలికపై ఫిల్మ్ మేకర్ లైంగిక వేధింపులు.. చివరకు..

By Sumanth KanukulaFirst Published Jan 15, 2022, 4:54 PM IST
Highlights

దేశంలో మహిళలు, చిన్నారులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో నిందితులు వారిని నమ్మించి మోసం చేస్తున్నారు. 
 

దేశంలో మహిళలు, చిన్నారులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో నిందితులు వారిని నమ్మించి మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ముంబైలో వెలుగుచూసింది. సినీ పరిశ్రమంలో పనిచేసే అవకాశం కల్పిస్తానని నమ్మించి ఓ ఫిల్మ్‌ మేకర్.. బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకన్న ముంబై పోలీసులు.. ఫిల్మ్ మేకర్‌ను జనవరి 14వ తేదీన అరెస్ట్ చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 354ఏ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. 

ఇక, కొద్ది రోజుల క్రితమే సినిమాలో పని ఇప్పిస్తామంటూ శారీరక సంబంధం పెట్టుకోవాలని డిమాండ్ చేసిన కాస్టింగ్ కౌచ్ డైరెక్టర్‌ను ముంబైలోని మలాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడైన డైరెక్టర్‌ను పోలీసులు తిట్వాలా ప్రాంతంలో అరెస్టు చేశారు. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లో నటించాలనే సాకుతో దర్శకుడు మొదట బెంగాలీ నటి సన్నిహిత చిత్రాలను తీశాడు. తరువాత, ఆ ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించి.. అతనితో శారీరకంగా సంబంధం పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అతడు ఫేస్‌బుక్‌లో మహిళా సబ్-డైరెక్టర్ ప్రొఫైల్‌ను తయారు చేసి.. దాని ద్వారా నటితో చాట్ చేయడం మొదలుపెట్టాడు. 

రాజీ కుదుర్చుకోవాలని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే నటి మాత్రం అందుకు నిరాకరించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

కొళ్లుగా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి పలవురు ప్రముఖ నటీమణులు బహిరంగగానే కామెంట్స్ చేస్తున్నారు. తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే ఈ కేసును బట్టి చూస్తే.. కింది స్థాయిలో కూడా అవకాశాల పేరుతో కొందరు ఫిల్మ్ మేకర్స్ ఎలా ప్రవర్తిస్తున్నారనేది అర్థం అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 

click me!