UP Assembly Election 2022: అఖిలేష్ మైండ్‌గేమ్.. సీఎం యోగిపై పోటీకి బీజేపీ ఎమ్మెల్యేకు టికెట్ ఆఫర్

By Mahesh KFirst Published Jan 17, 2022, 6:14 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రసవత్తర రాజకీయానికి తెర తీస్తున్నాయి. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీకి మధ్య పోటీ తీవ్రతరమైంది. అఖిలేష్ యాదవ్ మైండ్‌గేమ్ స్టార్ట్ చేశారు. బీజేపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై ఆయన పార్టీకి చెందిన వ్యక్తినే పోటీగా నిలబెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. గోరఖ్‌పూర్ నుంచి యోగికి టికెట్ ఇవ్వనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఈ కారణంగా గోరఖ్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించింది. తాజాగా, ఆ ఎమ్మెల్యేకు తాము టికెట్ ఇస్తామని అఖిలేష్ ప్రకటించారు.
 

లక్నో: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యానాథ్‌(CM Yogi Adityanath)ను గోరఖ్‌పూర్(Gorakhpur) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపనున్నట్టు బీజేపీ (BJP) ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత అయోధ్య నుంచి బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్టు ప్రచారం జరిగినా.. అధికారిక ప్రకటన మాత్రం భిన్నంగా వచ్చింది. యోగి ఆదిత్యానాథ్ గోరఖ్‌పూర్ నుంచే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అది ఆయన స్వస్థలం కూడా. కాబట్టి.. అక్కడే ఎక్కువ పట్టు ఉండే అవకాశం ఉన్నదని, బీజేపీ ఆయనకు గోరఖ్‌పూర్ నుంచే టికెట్ ఇచ్చింది. ఈ కారణంగానే గోరఖ్‌పూర్ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ రాధా మోహన్ అగర్వాల్‌కు టికెట్ నిరాకరించింది. పార్టీ టికెట్ కోల్పోవడంతో ఆ ఎమ్మెల్యే రుసరుస లాడుతున్నాడు. ఈ అవకాశాన్ని సమాజ్‌వాదీ పార్టీ(SP).. యోగిపై అస్త్రంగా మార్చుకోవాలని భావించింది.

బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ రాధా మోహన్ అగర్వాల్‌కు తమ పార్టీ టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆఫర్ ఇచ్చారు. లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్న సంకల్ప్ దివస్ సందర్భంగా అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో విలేకర్లు గోరఖ్‌పూర్ అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ రాధా మోహన్ అగర్వాల్ ప్రస్తావన తెచ్చారు. దీనిపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, మీరు ఒకవేళ ఆయనను కాంటాక్ట్ చేయగలిగితే.. ఆయనతో మాట్లాడగలిగితే.. టికెట్ ప్రకటిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆయనకు టికెట్ ఇస్తామని వివరించారు. 

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ తన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి కార్యక్రమం నాకు ఇంకా గుర్తు ఉన్నదని అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఆ కార్యక్రమంలో గోరఖ్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాధా మోహన్ అగర్వాల్ ఉన్నారని వివరించారు. అప్పుడు కూడా ఆయన కూర్చోడానికి ఒక సీటు కూడా లేదని, ఆ కార్యక్రమంలో ఆయన నిలబడే ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో అత్యధికంగా అవమానాలపాలు అయినది అతడే అని పేర్కొన్నారు.

బీజేపీలో టికెట్ పొందక రెబల్‌గా మారిన ఎమ్మెల్యేల గురించి అంతకు ముందు ప్రస్తావించగా.. అఖిలేష్ యాదవ్ సమాధానం భిన్నంగా ఉన్నది. తాము అందరికీ సీట్లు ఇవ్వలేమని అన్నారు. బీజేపీ దాని టికెట్లు పంపిణీ చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పుడైతే.. తాము ఎవరినీ తమ పార్టీలోకి తీసుకునే పరిస్థితి లేదని వివరించారు. కాగా, గోరఖ్‌పూర్ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ రాధా మోహన్ అగర్వాల్ గురించి ప్రస్తావించగానే అఖిలేష్ యాదవ్ తన వైఖరి మార్చారు. ఆ బీజేపీ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తామని ఆఫర్ చేశారు. 

Samajwadi Partyకి చెందిన Aditya Thakur అనే నేత పార్టీ టికెట్ దొరక్క suicide attemptకు యత్నించారు. లక్నో లోని పార్టీ కార్యాలయం ముందే ఒంటిమీద petrol పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే ఆయనను అడ్డుకున్నారు. Party membership కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నానని, అప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకన్నానని ఠాకూర్ బోరున విలపించారు. ఐదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానని తెలిపారు.

click me!